విశ్వంవాయిస్ న్యూస్, ముమ్మిడివరం విశ్వం వాయిస్ న్:
రైతుల వద్ద ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలి:
పితాని బాలకృష్ణ డిమాండ్
ఐ పోలవరం విశ్వం వాయిస్ న్యూస్
: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు
బుధవారం ఐ పోలవరం మండలం జి వేమవరం గుతేనాదివి చిన్న కొడప పెద్ద కొడప గ్రామాలలో రైతులు వద్ద కు వెళ్లి రైతుల గోడును చూసి చలించిపోయిన పితాని బాలకృష్ణ
ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా వర్షాలకు పాడయిన పంటలకు ఇన్సూరెన్స్ ఇవ్వలేదని, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే బస్తాకు 300 రూపాయలు సుమారు 400 రూపాయలు తక్కువకి అడుగుతున్నారని అయినా కొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ మోహన్ రెడ్డి రైతులు పక్షపాతి నని చెప్పుకోవటం పచ్చి అబద్ధమని, ఇప్పటికి అయినా సిగ్గు తెచ్చికుని రైతులు వద్ద వున్న ధాన్యాన్ని తడి పొడి అని వివక్ష లేకుండా షరతులు లేకుండా కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు.
అదే సమయంలో అక్కడ వచ్చిన అగ్రికల్చర్ ఆఫీసర్ యమ్. వాణి తో పితాని బాలకృష్ణ మాట్లాడుతూ
ప్రభుత్వం మద్దతు ధర 1530 రూపాయిలు ప్రకటించామని చెప్పడం తప్ప రైతు చేతికి 1100రూపాయలు అంతకన్నా తక్కువకి అడుగుతున్నారని దానికి తోడు ఇదంతా మీరు కనుగొలు చేయకపోవటం వల్ల మిల్లర్లు సిండికేటు అయి దారుణానికి ఒడిగడుతున్నారని ప్రభుత్వం ఎకరానికి 45బస్తాలే కొంటాం అని నిబంధనలు పెట్టడంతో మిగులు పంట ఏమి చేయాలో తెలియని గందరగోళ పరిస్థితిలో రైతు ఉన్నాడని పడించిన మొత్తం ధాన్యాన్ని వెంటనే కనుగొలు చెయ్యాలని జనసేన పార్టీ తరుపున పితాని బాలకృష్ణ ఏవో యమ్ వాణి కి డిమాండ్ చెయ్యడం జరిగింది.
అగ్రికల్చర్ ఆఫీసర్ జనసేన పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కి డిమాండ్ కు సానుకూలం స్పందించి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేస్తా మని, రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, యమ్ పి టి సి లంకెలపల్లి జమ్మి, కర్రీ శేఖర్, సలాది రాజా, ఇండుగుల రామకృష్ణ, లంకెలపల్లి వెంకటేశ్వరావు, పడాల లక్మీన్, మారిశెట్టి శ్రీను, మారిశెట్టి దుర్గాప్రసాద్, పోలినటి వినీల్ కాశీ రాజు మరియు జనసేన పార్టీ నాయకులు జన సైనికులు పాల్గొన్నారు.