WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

సచివాలయ యూనిఫాం సిబ్బంది నామోషీగా ఫీలైపోతున్నారా…!

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఆ యూనిఫారం బ్యాండ్ మేళంలా ఉందట… అదేంటో…

గ్రామ సచివాలయ నిర్వహణలో సంస్కరణల ఆవశ్యకత..

– లక్షల వ్యయంతో సిబ్బందికి యూనిఫామ్ ల అందజేత..

– మూణ్ణాళ్ళ ముచ్చట గా మారిన వైనం..

– ఫిర్యాదుల హోదా తెలియక కాళ్లరిగేలా ప్రజల ప్రదక్షిణలు..

– యాప్ ద్వారా పారదర్శకత తీసుకురావాలని ప్రజలు డిమాండ్..

విశ్వంవాయిస్ న్యూస్, డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా:

డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా విశ్వం వాయిస్ న్యూస్ : గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యం రావాలంటే ప్రజలందరి కనీస అవసరాలు గ్రామస్థాయిలో తీరాలి..సమస్యలన్నీ గ్రామస్థాయిలో పరిష్కరింపబడాలి..ఆ లక్ష్యంతోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రికగా సరికొత్త ప్రభుత్వ శాఖగా నిర్మితమైంది గ్రామ, వార్డు సచివాలయ శాఖ. ఇంత వరకూ బాగానే ఉన్నా..సచివాలయంలో సిబ్బంది అంటే 43నెలలు గడుస్తున్నా ప్రజల్లో నేటికీ కనీస అవగాహన లేదంటే లోపం ఎక్కడ ఉంది..? కాదు కాదు అవగాహన రానీయకుండా చేస్తున్నారు..! ఈ వార్త చదివిన సచివాలయ సిబ్బందికి, ఈ శాఖ ముఖ్య అధికారులకి ప్రభుత్వానికి కాస్త నొచ్చుకున్నట్టుగా ఉన్నా ఇది అక్షర సత్యం.. సచివాలయ ఉద్యోగులను ప్రజలను సులువుగా గుర్తుపట్టడం కోసం సిబ్బందికి కేటాయించిన యూనిఫారం బ్యాండ్ మేళం బ్యాచ్ లా ఉందని.. సిబ్బంది వాటిని వేసుకోవడమే మానేస్తున్నారు. కొన్నిచోట్ల అధికారుల పర్యటనలు, సమావేశాలు ఏర్పాటు చేసే సమయంలోనే వేసుకొని వస్తూ అధికారులను బురిడీలను చేస్తున్నారు. మరికొందరైతే ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారంలోని షర్ట్ ఒకటి, ఫ్యాంటు ఒకటి వేసుకొని వస్తున్నారు. ఇదేమంటే ఈ డ్రెస్సు వేసుకుంటే బేండ్ మేళం బ్యాచ్ అని వెటకారం చేస్తున్నారని సిబ్బందే ఎగతాలిగా మాట్లాడుతుండటం ఇపుడు దుమారాన్ని రేపుతోంది. కొన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు కఠినంగా వ్యవహరించడంతో సిబ్బంది ఖచ్చితంగా యూనిఫారం వేసుకొని వస్తున్నా… డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం సచివాలయ యూనిఫాం ను వేసుకోవడానికి సిబ్బంది చాలా నామోషీగా ఫీలైపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన యూనిఫాం ఖచ్చితంగా వేసుకోవాలా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

మండల స్థాయిలో ఎంపీడీఓల పర్యవేక్షణ కొరవడి..
డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ సచివాలయ సిబ్బంది రెగ్యులర్ గా యూనిఫాం వేసుకు రాకపోవడం వెనుక పూర్తిస్థాయిలో మండల స్థాయిలో ఎంపీడీఓల పర్యవేక్షణ కొరవడిందనే చెప్పాలి. దానికి కారణం కూడా లేకపోలేదు. జిల్లా స్థాయి అధికారులు ఎప్పుడోగానీ సచివాలయాలను సందర్శించరు. కానీ ఎంపీడీఓ అనునిత్యం పంచాయతీలు, గ్రామసచివాలయాల సందర్శన చేస్తూనే ఉంటారు. కనీసం ఆ సమయంలోనైనా సిబ్బంది పూర్తిస్థాయిలో ప్రభుత్వం నిర్ధేశించిన యూనిఫాంను వేసుకుని వస్తున్నారా..లేదా అనే విషయాన్ని గమనించాల్సి వుంటుంది. కానీ ఎంపీడీఓలు ఆ పనిని చేయడం లేదు. ఎప్పుడు సచివాలయానికి వచ్చినా రికార్డులు తిరగేసి వెళ్లిపోవడం తప్పితే సచివాలయ వ్యవస్థ ప్రజలకు ఏ స్థాయిలో చేరువ అయ్యిందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. అలా అంటే ఎంపీడీఓలకు కోపం వచ్చినా అది మాత్రం అక్షర సత్యం. కనీసం అప్పుడప్పుడైనా విజిటింగ్స్ కి వచ్చే డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులదీ అదీ తీరు. ఎవరూ సిబ్బంది విషయంలో పెద్దగా పట్టించుకోవడం లేదనే విషయం సిబ్బంది తమకు నచ్చిన సమయంలోనే యూనిఫాం వేసుకొరి రావడాన్ని స్పష్టం చేస్తున్నది. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, పంచాయతీ కార్యద్శిలు ఇద్దరు మాత్రమే పంచాయతీరాజ్ శాఖ పరిధిలోకి వస్తారు. మిగిలిన వారంతా వివిధ శాఖలకు చెందినవారే కావడంతో అధికారులు కూడా ఆ విధంగానే వ్యవహరిస్తున్నారు. పట్టించుకోవడం లేదు. కొన్నిసమయాల్లో అధికారులు సచివాలయాలకు పర్యటనలకు వచ్చినపుడు వేసుకుని వచ్చే సమయంలో కూడా సిబ్బంది మొత్తం రెగ్యులర్ గా యూనిఫాం వేసుకొని వస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఆరా తీయడం లేదు. మరీ ముఖ్యంగా మండల కేంద్రాల్లోని సచివాలయాల్లోనే ఈ విధంగా సిబ్బంది యూనిఫాం వేసుకొని రాకపోవడం విచిత్రంగా, మరి కాస్త వెటకారంగానూ కనిపిస్తోంది.

కొందరు సిబ్బంది అసత్య ప్రచారం.. ప్రతీది మీరు గుచ్చి గుచ్చి అడిగితే మేము ఏం చెప్పగలమండీ..
గ్రామసచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శిలు యూనిఫాం విషయంలో వారికి నచ్చినట్టుగా సొంత ప్రచారాలను ఎడా పెడా చేసుకుంటూ అటు ప్రజలకి, ఇటు అధికారులకు కళ్లుమూసి జెల్ల కొడుతున్నారు. పంచాయతీ కార్యదర్శిలకు ప్రభుత్వం యూనిఫారం వేసుకోవడంలో వెసులు బాటు ఇచ్చిందని.. తెగ చెప్పేసుకుంటున్నారు. ఆ కారణంగానే తాము రెగ్యులర్ గా యూనిఫాం వేసుకోవడం లేదని చాలా ధీమాగా అంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలా అయితే అధికారుల పర్యటనల సమయంలో ఎందుకు యూనిఫాంతో దర్శనమిస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం చిలకనవ్వు నవ్వుతూ.. ప్రతీది మీరు గుచ్చి గుచ్చి అడిగితే మేము ఏం చెప్పగలమండీ.. ఇప్పటికే యూనిఫాం వేసుకుంటే బ్యాండ్ మేళం బ్యాచ్ అంటున్నారని..దానికోసం కోసం కాస్త వెసులుబాటు తమకు తామే ఇచ్చుకొని అధికారులు వచ్చినపుడు మాత్రం నిత్యం వేసుకుంటున్నట్టుగా నటించాల్సి వస్తుందని కొందరు సచివాలయ కార్యదర్శిలు తప్పని తెలిసినా కుండ బద్దలు కొడుతున్నారు. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లోని వార్డు సచివాలయాల్లోని సిబ్బంది మాత్రం యూనిఫాం తప్పక వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ మండల అధికారులు ఎంపిడివో, తాసిల్దార్ ఇలా ఎవరో ఒకరు రావడంతో మండలాల్లో సచివాలయ సిబ్బంది మాత్రం తప్పక వేసుకోవాల్సి వస్తున్నారు. ఒకటి అరా వేసుకొని రాకపోయినా పెద్దగా అక్కడ కూడా పట్టింపు ఉండటం లేదు.

అధికారులు మరీ అంతలా కనిపిస్తున్నారా..
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జిల్లా అధికారులు, మండల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరీ అంతలా కనిపిస్తున్నారా.. అంటే నిజంగానే అలా కనిపిస్తున్నారనే చెప్పాలి. జిల్లా కలెక్టర్ నుంచి మండస్థాయిలో ఎంపీడీపీఓ, ఈఓపీఆర్డీ, ఆఖరికి ప్రజా ప్రతినిధుల వరకూ ఇదే పరిస్థితి. ఏ అధికారి, ఏ నాయకుడు సచివాలయానికి వచ్చినా పథకాలు అమలు కోసం మాట్లాడటం తప్పితే.. ప్రజలకు ప్రభుత్వం సిబ్బందికి కేటాయించిన యూనిఫాం ఎవరు వేసుకుని వస్తున్నారు.. ఏస్థాయిలో ప్రజలకు చేరువ అయ్యారు..ఎంత మంది ప్రజలు నేరుగా సమస్యలు విన్నవించుకోవడానికి వస్తున్నారనే ప్రశ్నలు వేయడం లేదు.. లేదో చెప్పండనే ప్రశ్న వేయరంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆ విధంగా సచివాలయ సిబ్బంది, చాలా చోట్ల పంచాయతీ కార్యదర్శిలు అలా అధికారులకు మేకప్ వేస్తున్నారు. కొంత మంది ఏకంగా బ్యాండ్ మేళం బ్యాచ్ లా ఒకేలా కనిపిస్తున్నామని చెబితే మేము వచ్చినపుడు అలా వేసుకురండి..తరువాత మీ సౌలభ్యాన్ని బట్టి మీరు సెట్ చేసుకోండని చెప్పే అధికారులు కూడా ఉన్నారనే ప్రచారం కూడా గట్టిగానే జరుగుతుంది. అంటే ప్రజలకు సచివాలయ సిబ్బంది పలానా యూనిఫాంలో ఉంటారనే ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రభుత్వ అధికారులే గాలి తీసేస్తున్నారని అనుకోవాలా..? అలా కాకపోతే యూనిఫాం వేసుకోని సిబ్బందిని ఎందుకు ప్రశ్నించడం లేదు..నేటికీ సక్రమంగా వేసుకొని కార్యదర్శిలు ఇతర సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే మాత్రం ఏ ఒక్క అధికారి వద్ద సమాధానం దొరకని పరిస్థితి.
ప్రజల కోసం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయంలో ప్రజలు గుర్తుపట్టే విధంగా కాకుండా వారికి నచ్చినట్టుగా వారు యూనిఫాం కాకుండా రక రకాల దుస్తులు వేసుకొని వచ్చి మరీ విధులు నిర్వహిస్తుంటే వారిని జిల్లా అధికారులే ప్రోత్సహిస్తున్నారా అనే ప్రశ్నలు కూడా ఉద్బవిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానస పుత్రికైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఎంత పటిష్టంగా పనిచేసి ప్రజలకు సేవలు అందిస్తే అంతే స్థాయిలో దేశం మొత్తం గర్విస్తుందనే కోణంలో జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా ఆలోచించాల్సి వుంది. అలా జరగాలంటే సచివాలయంలో పనిచేసే సిబ్బంది ఎలా ఉంటారు..ఏ దుస్తుల్లో ఉంటారు..ఎలాంటి సేవలు అందుతాయనే విషయం ప్రజలకు చైతన్యం, గుర్తింపు కలిగించాల్సిన బాధ్యత మొట్టమొదటిగా జిల్లా అధికారులపైనే ఉంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటై 43 నెలలు కావస్తున్నా..సిబ్బంది మొత్తం గ్రామాల్లోని సచివాలయాల్లోనే పనిచేస్తున్నా నేటికీ ఎవరు ఏంటో ఏ ఒక్క ప్రజానీకానికీ తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఒక వ్యవస్థ ప్రజల్లోకి వెళ్లాలన్నా..గుర్తింపు రావాలన్నా..ప్రజలు మొచ్చాలన్నా జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోతే అది సాధ్యం కాదనేది వాస్తవం. ఇకపై జిల్లా అధికారులు సచివాలయ సిబ్బంది డ్రెస్ కోడ్ విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారిస్తారనేది దైవాదీనం .!

 

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement