తాళ్లరేవులో టిడిపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన నాయకులు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
తాళ్ళరేవు మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిరసన చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంటలు బాగా దెబ్బతినడంతో చాలా మటుకు రైతుల ధాన్యం రంగు మారి మొలకలు ఎత్తే పరిస్థితిలో ఉందని ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప చేతల్లో ఏమీ లేదని కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు కార్యాచరణలో మాత్రం అమలు కాలేదని వారు విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయడానికి ఎటువంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని మండల తెలుగుదేశం నాయకులు టేకుమూడి లక్ష్మణరావు డిమాండ్ చేశారు. అనంతరం తాళ్ళరేవు మండల తహసిల్దార్ కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు దూళిపూడి బాబీ, జక్కల ప్రసాద్ బాబు, సాధనాల వెంకట శివరామకృష్ణ, పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొని నిరసన తెలియజేశారు.