కౌన్సిలర్ మందపల్లి రవి…
మండపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 7,8 వార్డులలో సీసీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, గోతులతో నిండిపోయాయని,సిసి రోడ్లు డ్రైనేజీల్లో ఒరిగిపోయాయి అని వెంటనే వాటిని పరిష్కరించి తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను 8 వార్డ్ కౌన్సిలర్ మందపల్లి రవి కోరారు. మండపేట టౌన్ పరిధిలో 30 వార్డులకు సీసీ రోడ్ల రిపేరు పనుల నిమిత్తం 17 లక్షలు శాంక్షన్ అయ్యి మూడు నెలలు గడిచిన నేటి వరకు ఈ రోడ్డు రిపేర్ పనులకు మోక్షం కలగలేదని అన్నారు. ఎంపీడీవో ఆఫీస్ కి వెళ్లే రోడ్డు ఇదే కావడంతో ప్రజలు ప్రతిరోజు తమ సమస్యల నిమిత్తం చాలామంది ఈ రోడ్ గుండా వెళ్తారని అంతే కాకుండా ఆటో,లారీలు వెళ్లాలంటే ప్రమాదకరంగా మారిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ఈ నిర్లక్ష్య ధోరణి విడనాడి ఈ సమస్యలపై త్వరతిగతిన చర్యలు తీసుకుని ఈ పనులను పూర్తి చేయాలనీ కౌన్సిలర్ మందపల్లి రవి డిమాండ్ చేశారు.