మండపేట బురుగుంట చెరువు గట్టు వద్ద గల అన్నపూర్ణమ్మ సమేత అమృతలింగేశ్వరస్వామి వారి దేవాలయంలో దీపావళి ను పురస్కరించుకుని పలు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ వారిని బంగారు చీరతో అలంకరించారు. మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ ఆలయానికి విచ్చేసి అమ్మ వారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ప్రకాష్ వెంట ఎమ్మార్పీఎస్ఎస్ వ్యవస్థాపకులు బుంగ సంజయ్, కౌన్సిలర్ కాశిన కాశీ విశ్వనాధం తదితరులు ఉన్నారు.

