21 October 2025
Tuesday, October 21, 2025

అప్పుడైనా… ఎప్పుడైన…రైతు బాంధవుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే వైఎస్.జగన్మోహన్ రెడ్డిదే…

విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట

డా.బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐ.టి.వింగ్ అధ్యక్షులు యరమాటి వెంకన్నబాబు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కృషి చేసింది వైయస్.జగన్మోహన్ రెడ్డి అని మరొక్కసారి నిరూపనైందన్నారు. 2024ఎన్నికలకు ముందు కూటమి నాయకులు అధికారం కోసం రైతులకు ఇచ్చిన హామీని మర్చిపోయి అధికారం వచ్చి సంవత్సరకాలం దాటినా, రైతులు అప్పులు పాలైపోయినా పట్టించుకోకుండా ఇప్పుడు 5వేలు వేసి ఏదో ఘనకార్యం చేసినట్లు ఆర్భాటాలు చేసుకోవడం ఈ కూటమి ప్రభుత్వ ప్రతినిధులుకు మాత్రమే చెల్లిందన్నారు. 2019 ఎన్నికల ముందు జగన్ రైతులకు ఏడాదికి రూ.12,500 చొప్పున 4 ఏళ్లు సాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పినదాని కంటే ఒక ఏడాది ఎక్కువ పెంచడమే కాకుండా రూ.1,000 పెంచి ఏడాదికి రూ.13,500 చొప్పున 5ఏళ్లలో రూ.34,288 కోట్లు ఆర్ధిక సహాయం అందించిన ఘనత జననేత జగన్ దే అన్నారు. మండపేట నియోజకవర్గంలో 18,229 మంది రైతులకు గత ఏడాది 2024-2025 కాలంలో ఇస్తానని ఇవ్వకుండా కాలయాపన చేసిన రూ.36కోట్ల 45 లక్షల 80వేలు ఎప్పుడిస్తారో పత్రికాముఖంగా రైతులకు చెప్పాలని యరమాటి వెంకన్నబాబు డిమాండ్ చేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo