అనాథలకు అన్నదానం…
సంక్షేమ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దిన మహోన్నతుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అని మండపేట మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం 76వ జయంతి వేడుకల సందర్భంగా 7వ వార్డులో గల ఆదర్శ హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్చంధ సేవా సంస్థలో నిరుపేదల సమక్షంలో ఆమె కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. సంస్థలోని వృద్దులకు, అనాథలకు పలు రకాల ఆహార పదార్ధాలతో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రజల గుండెల్లో ఎప్పుడూ చిర స్థాయిలో నిలిచిపోయే వ్యక్తి వైఎస్సార్ అన్నారు.ఎన్నో ఏళ్ళుగా అనాథలను అభాగ్యులను అక్కున చేర్చుకుని ఆకలి కడుపులు నింపుతున్న ఆదర్శ సంస్థ సేవలు అభినందనీయమన్నారు. సంస్థను నమ్ముకుని జీవిస్తున్న అనాథల కోసం నిర్వాహకుడు కొల్లి విశ్వనాథం చేస్తున్న సేవలను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మందపల్లి రవి కుమార్,షేక్&షేక్ మాజి కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా,సొసైటీ మాజీ చైర్మన్ పెంకే గంగాధరం వైస్సార్సీపీ నాయకులు ఎర్రగుంట అయ్యప్ప,మొండి మురళి, సాధనాల శివ భగవాన్,తణుకు అశోక్,పేరూరి మాధవి, జొన్నపల్లి సత్తిబాబు,తదితరులు పాల్గొన్నారు.