విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
మండపేట విశ్రాంత ఉద్యోగులు అసోసియేషన్ మాజీ గౌరవ అధ్యక్షులు రెడ్డి జానకి రామయ్య(87) ఇటీవల మృతి చెందారు. ఈయన మునిసిపల్ కో ఆప్షన్ సభ్యులు రెడ్డి రాధాకృష్ణ కు పెద్ద నాన్న అవుతారు. పాటి మీద ఆయన స్వగృహానికి వెళ్ళి పలువురు పరామర్శించారు.ఆయన మనుమలు చోడే రాంబాబు, పెనుమర్తి సూర్య, వారి కుటుంబ సభ్యులను బిక్కిన పెద్ద చిన్న, బిక్కిన వీరబాబు, సొసైటీ మాజీ అధ్యక్షులు పెంకే గంగాధర్,టెకీముడి శ్రీనివాస్ , నాయకులు తాడి రామారావు, శివకోటి శేష సుబ్రహ్మణ్యం, దుగ్గిరాల రాంబాబు, రామోజు కృష్ణ,పంపన శ్రీను, పిఠాపురం సత్యనారాయణ పరామర్శించారు
బాధితులకు ఎక్స్‌గ్రేషియా 25 లక్షలు ఇవ్వాలి...
ఎమ్మెల్సీ తోట డిమాండ్...
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
మండల కేంద్రమైన రాయవరం గ్రామ శివారులో గణపతి ఫైర్ వర్క్స్ బాణాసంచా తయారీ కర్మాగారంలో జరిగిన భారీ విస్ఫోటనం ఘటనలో పదిమంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన బాధితుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని రాష్ట్ర సబార్డినేట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.తోట త్రిమూర్తులు మాట్లాడుతూ మునుపటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి, తక్షణమే చెల్లించేలా ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుత...
విశ్వం వాయిస్ న్యూస్, మండపేట
మండపేట బురుగుంట చెరువు గట్టు వద్ద గల అన్నపూర్ణమ్మ సమేత అమృతలింగేశ్వరస్వామి వారి దేవాలయంలో దీపావళి ను పురస్కరించుకుని పలు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ వారిని బంగారు చీరతో అలంకరించారు. మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ ఆలయానికి విచ్చేసి అమ్మ వారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ప్రకాష్ వెంట ఎమ్మార్పీఎస్ఎస్ వ్యవస్థాపకులు బుంగ సంజయ్, కౌన్సిలర్ కాశిన కాశీ విశ్వనాధం తదితరులు ఉన్నారు.
చిత్రలేఖనం ద్వారా విద్యార్థుల సందేశం
డ్రాయింగ్ మాస్టర్ సౌదాగర్ సూచనలు
విశ్వం వాయిస్ న్యూస్, మండపేట
దీపావళి శుభాకాంక్షలు తెలిపుతూ మండపేట ఎంపిఎస్ పాఠశాల విద్యార్థుల పటాకుల వాడకాన్ని తగ్గించి కుటుంబంతో కలిసి దీపాలు వెలిగించి శాంతియుతంగా పండుగని జరుపుకోవాలని సందేశాత్మక చిత్రాల ద్వారా తెలిపారు. రాబోయే తరాలకు కాలుష్యం కలిగించని దీపావళి గురించి పరిచయం చేయాలని, అలాంటి దీపావళి మొదట మనం ఆచరించి, తదుపరి తరాలకు తెలపాలని సందేశమిస్తూ మండపేట పబ్లిక్ స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ సౌదాగర్ తన విద్యార్థులతో దీపావళి సందర్భంగా వేయించిన చిత్ర లేఖనాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సౌదాగర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించని దీపావళి మన పూర్వీకులు ఆచరించారని, లక్ష్మీ పూజలు,పిండి వంటలు, దీపాల వరుసలతో ప్రతి...
వ్యాపార కార్యకలాపాలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు
కళ్ళెదుట కనబడుతున్నా కళ్ళు మూసుకుంటున్న యంత్రాంగం
సరఫరాదారులు సిలిండర్ కు అధికంగా వసూలు చేస్తూ, బ్లాక్ లో సరఫరా చేస్తున్నారని విమర్శలు
ప్రమాదంగా మారకముందే మేలుకోవాలని ప్రజల హితవు
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక ఇబ్బందులను తగ్గించి, వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న విధంగా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, దీపం పధకం ద్వారా పేద,మద్య తరగతి ప్రజలు నిత్యం వినియోగించే వంట గ్యాస్ ను సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా అందిస్తూ సహాయ పడుతున్నప్పటికీ, గృహ అవసరాల నిమిత్తం వినియోగించవలిసిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. పేద,...
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
మండపేట పట్టణ ప్రజలందరికీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పతివాడ నూక దుర్గారాణి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం దీపావళి పండుగ సందర్భంగా ప్రజలంతా పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని ఆమె ఆకాక్షించారు.చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటారన్నారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లోనూ సరికొత్త వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు.
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
కమ్యూనిటీ పారామెడిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ పియంపి అసోసియేషన్ ఆద్వర్యంలో ధన్వంతరి జయంతి శనివారం నిర్వహించారు. జిల్లా పీఎంపీ అద్యక్షులు కోన సత్యనారాయణ ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ దేశంలో ప్రాచీన కాలం నుంచి అందుబాటులో ఉన్న వైద్యం ఆయుర్వేద వైద్యం అని పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్యాన్ని ఎందరో మహానుభావులు సాధన చేసి అందులో నిష్ఠాతులయ్యారన్నారు. దీనికి మూలపురుషుడుగా భావించే ధన్వంతరి మానవులకు ఆయుర్వేద జ్ఞానాన్ని అందించాడన్నారు. సూర్య భగవాన్ వద్ద ఆయుర్వేదం నేర్చుకున్న ధన్వంతరి 16 మంది శిష్యుల్లో ఒకడని చెప్పారు. దీపావళికి ముందు వచ్చే ఆశీయుజ బహుళ త్రయోదశి రోజు ఆరోగ్యానికి...
విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, రాయవరం
రాయవరం సబ్ స్టేషన్ పరిధిలో రాయవరం 11కెవి టౌన్ 2, మాచవరం ఫీడర్ల పరిధిలో మరమ్మత్తుల నిమిత్తం రాయవరం,మహేంద్రవాడ,మాచవరం గ్రామాలకు అక్టోబర్ 18 శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు శుక్రవారం తెలిపారు. దీనికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
క్రీడలను ఎప్పుడు ప్రోత్సహించే మాధవి ఆయిల్స్ అధినేత వేగుళ్ళ కృష్ణ చైతన్య బాబు స్థానిక విజయలక్ష్మి నగర్ శివారు బైపాస్ రోడ్డు నందు యువతకు ఉపయోగకరమైన మాధవి స్పోర్ట్స్ బాక్సులను బుధవారం నాడు ప్రారంభించారు. ఇందులో రెండు క్రికెట్ కోర్టులు, ఒక శెట్టిల్ కోర్టు, ఒక వాలీబాల్ కోర్ట్ ,ఒక పింక్ బాల్ కోర్టును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత ఆరోగ్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోజుకి ఒక గంటపాటైన ఆరోగ్యం పట్ల దృష్టి సారించి కసరత్తులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, వేగుళ్ల రేణుకాదేవి, వల్లూరి కుమార్ బాబు, వల్లూరి రామన్న...
యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పదిమంది కార్మికుల మృతి
అండగా ఉంటామని నాయకుల నోటిమాట, అర్థం కాని కూటమి ప్రభుత్వ పోకడ
శనివారం లోపు పరిహారం ప్రకటించక పోతే, బాధిత కుటుంబాలతో కలిసి ఉద్యమం బాట.
పీ.డీ.ఎస్.యూ, ఏ.ఐ.కె.ఎం.ఎస్, ఎం.ఆర్.పి.ఎస్., ఎస్.సీ, బీ.సీ, మైనార్టీ ప్రజా సంఘాల హెచ్చరిక
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం గ్రామ శివారులో శ్రీ గణపతి ఫైర్‌వర్క్స్ బాణాసంచా తయారీ కర్మాగార కేంద్రంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకమని, ఘటన జరిగి వారం రోజులు గడిచినా నష్టం పరిహారం పై ప్రకటన లేని ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీ.డీ.ఎస్.యూ, ఏ.ఐ.కె.ఎం.ఎస్., ఎం.ఆర్.పి.ఎస్.,...