20 October 2025
Monday, October 20, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

ఎడిటర్ వాయిస్

మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తరుణంలో జగ్గంపేట శాసనసభ్యులు టిటిడి బోర్డు మెంబర్ జ్యోతులను గోకవరం డిపోలో ఉచిత బస్సును ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మహిళలు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఉచిత బస్సు కు జెండా ఊపి, మహిళలతో ప్రయాణం చేశారు . ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఐదు రకాల బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం సాగించే అవకాశం ప్రభుత్వం కల్పించిందని పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ ,మెట్రో ఎక్సప్రెస్ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం చేయవచ్చు అన్నారు. ఈ పథకం ద్వారా 2.6 2 కోట్ల స్త్రీలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ...

మహిళలకు ఉచిత బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన తరుణంలో జగ్గంపేట శాసనసభ్యులు టిటిడి బోర్డు మెంబర్ జ్యోతులను గోకవరం డిపోలో ఉచిత బస్సును ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం చేసిన మహిళలు. ఉచిత బస్సు కు జెండా ఊపి, మహిళలతో ప్రయాణం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఐదు రకాల బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం సాగించే అవకాశం ప్రభుత్వం కల్పించిందని పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ ,మెట్రో ఎక్సప్రెస్ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం చేయవచ్చు అన్నారు. ఈ పథకం ద్వారా 2.6 2 కోట్ల స్త్రీలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకానికి సంవత్సరానికి...

జాతీయస్థాయి జూడో పోటీలకు ఎంపికైన జగ్గంపేట భాష్యం విద్యార్థిని

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, జగ్గంపేట ఈ నెల 9, 10 తేదీల్లో గుంటూరులో నిర్వహించిన సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ జూడో చాంపియన్షిప్లో కాకినాడ జిల్లా జగ్గంపేట భాష్యం స్కూల్ కి చెందిన బత్తుల తేజస్వి ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించి, జాతీయస్థాయికి అయ్యారని ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ రెడ్డి సత్యనారాయణ తెలియజేశారు. సెప్టెంబర్ 8వ తేదీన హర్యానాలో జరిగే జాతీయస్థాయి జూడో పోటీల్లో పాల్గొంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వారు తేజస్విని సత్కరించి జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమెకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, జోనల్ ఇన్చార్జ్ గోవిందరాజు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ ప్రిన్సిపాల్ వాణి, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.

భవిత కేంద్రం దివ్యాంగులు స్కూలుకు ప్రింటర్ బహుకరించిన ఇంజరపు దుర్గ బాబు మేరీ దంపతులు

దివ్యాంగుల మధ్య పెళ్లిరోజు జరుపుకుని వారికి అన్నదానం నిర్వహించారు విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామానికి చెందిన టిడిపి ఎస్సీ నాయకులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఇంజరపు దుర్గ బాబు మేరీ దంపతులు ప్రతి సంవత్సరం వివాహ వార్షికోత్సవం సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. గత సంవత్సరం తాళ్లూరు జి య్యాన్న ఆలయానికి 25 వేల రూపాయల ఇన్వెర్టర్ బహుకరించారు. తర్వాత సౌండ్ సిస్టం బహుకరించారు. ఈ సంవత్సరం పెళ్లి రోజు సందర్భంగా జగ్గంపేట భవిత కేంద్రంలోని దివ్యాంగుల స్కూల్ కు 13000 రూపాయల ప్రింటర్ బహుకరించారు. అనంతరం దివ్యాంగుల కు భోజనాలు ఏర్పాటు చేసి వారితో పాటు భోజనాలు చేశారు. ఈ సందర్భంగా దుర్గ బాబు మాట్లాడుతూ ముందుగా మా ఇష్టదైవం తాళ్లూరు వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నామని ప్రతి పెళ్లి రోజుకు మా దంపతులం ఆర్భాటాలకు పోకుండా ఏదో...

150 ట్రాక్టర్లతో అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

హాజరైన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్, జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జగ్గంపేట రావులమ్మ ఆలయం వద్ద నుంచి 150 ట్రాక్టర్లతో బయలుదేరిన ర్యాలీని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు. నియోజవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ టాక్టర్ నడుపుతూ ర్యాలీ పద్మనాభ నగర్ కోనేటి వీధి మెయిన్ రోడ్డు మీదుగా గండేపల్లి మండలం మురారి వెళ్లి అక్కడ నుండి గండేపల్లి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిర్వహించారు. చైతన్య రథం పై రైతు వేషధారణలో ఎమ్మెల్యే నెహ్రూ యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో 150 ట్రాక్టర్లు పాల్గొన్నాయి. రైతు కూలీలను పలకరించారు. జయకృష్ణ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత...

ఏపీలో కొత్త రైల్వే లైను నిర్మాణానికి ప్రతిపాదనలు 

ఏపీలో కొత్త రైల్వే లైను నిర్మాణానికి ప్రతిపాదనలు విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి, విజయవాడ *ఏపీలో కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు.* మొత్తం 1,336 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ల నిర్మాణం. రూ.2,982 కోట్ల వ్యయమవుతుందని అంచనా. భద్రాచలం-కొవ్వూరు 70 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ల నిర్మాణం. ముద్దనూరు-పులివెందుల-ముదిగుబ్బ-శ్రీసత్యసాయి 105 కిలోమీటర్లు. అట్టిపట్లు-పుత్తూరు 30 కిలోమీటర్లు, 205 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు.

రాష్ట్రంలో బహుళ అంతస్తుల భవనాలకు 72 గంటల్లో పర్మిషన్ !

రాష్ట్రంలో బహుళ అంతస్తుల భవనాలకు 72 గంటల్లో పర్మిషన్ ! విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, విజయవాడ ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణాల అనుమతుల్ని ప్రభుత్వం తేలిక చేస్తోంది. ఇప్పటికే ఐదు అంతస్తుల వరకూ సెల్ఫ్ డిక్లరేషన్ తో ఆన్ లైన్ లోనే అనుమతులు తీసుకునే అవకాశం కల్పించింది. ఇప్పుడు బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతుల్ని కూడా సులభతరం చేస్తోంది. పట్టణాభివృద్ధిని వేగవంతం చేయడానికి , “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”ను ప్రోత్సహించడానికి బహుళ అంతస్తుల భవనాలకు 72 గంటల్లో అనుమతులు ఇవ్వడానికి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను ప్రవేశపెట్టింది. ఈ విధానం 12 అంతస్తులు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న భవనాల నిర్మాణ అనుమతులను 72 గంటల్లో జారీ చేయడానికి ఉపయోగపడుతుంది. నెలల తరబడి జాప్యం అయ్యే అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.మంగళగిరిలోని డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కార్యాలయంలో...

తెలంగాణకు బుల్లెట్ ట్రైన్

తెలంగాణకు బుల్లెట్ ట్రైన్ విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, హైదరాబాద్   తెలంగాణకు బుల్లెట్ రైలు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీకి ప్రతిపాదనలు సమర్పించారు.ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మీదుగా బుల్లెట్ రైలు మార్గం ఉండేలా ఈ ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పనులు జరుగుతున్నాయి.

ఏపీలో ఆగస్ట్ 25 నుంచి *కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు* 

ఏపీలో ఆగస్ట్ 25 నుంచి *కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు* విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఆంధ్రప్రదేశ్ ఏపీలో ఆగస్ట్ 25 నుంచి *కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు*   *QR కోడ్ తో పంపిణీ చేస్తున్న నేపథ్యంలో, మీ కార్డులలో కుటుంబ సభ్యుల మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే ఆలోపు చేసుకోగలరు.ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాలలో సభ్యుల తొలగింపు, జోడింపు, వివరాల సవరింపులు, కొత్త కార్డుల మంజూరు వంటి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది.

మాధవపట్నం పాఠశాల విద్యార్థులు జాతీయ అథ్లెటిక్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు

రాష్ట్రస్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్ క్రీడా పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపిక విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్ రాష్ట్రస్థాయి సౌత్ జోన్ క్రీడా పోటీలకు మాదపట్నం జడ్పీ పాఠశాలకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు టి.మురళీకృష్ణ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 3న పెద్దాపురం మహారాణి కాలేజీ క్రీడా మైదానంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ముగ్గురు క్రీడాకారులు ప్రతిభ కనబరిచారన్నారు. వీరు అండర్ - 18 విభాగంలో డి. రాజేష్ (1000 మీ) ప్రథమ స్థానం, ఎన్. యుగేష్ (400 మీ) ద్వితీయ స్థానం, అండర్- 14 విభాగంలో ఆర్.పవన్ గణేష్ (జావెలిన్) ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్రస్థాయి సౌత్ జోన్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వీరు ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు బాపట్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థులకు...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo