వ్యాపార కార్యకలాపాలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు
కళ్ళెదుట కనబడుతున్నా కళ్ళు మూసుకుంటున్న యంత్రాంగం
సరఫరాదారులు సిలిండర్ కు అధికంగా వసూలు చేస్తూ, బ్లాక్ లో సరఫరా చేస్తున్నారని విమర్శలు
ప్రమాదంగా మారకముందే మేలుకోవాలని ప్రజల హితవు
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక ఇబ్బందులను తగ్గించి, వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న విధంగా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, దీపం పధకం ద్వారా పేద,మద్య తరగతి ప్రజలు నిత్యం వినియోగించే వంట గ్యాస్ ను సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా అందిస్తూ సహాయ పడుతున్నప్పటికీ, గృహ అవసరాల నిమిత్తం వినియోగించవలిసిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. పేద,...
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
కమ్యూనిటీ పారామెడిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ పియంపి అసోసియేషన్ ఆద్వర్యంలో ధన్వంతరి జయంతి శనివారం నిర్వహించారు. జిల్లా పీఎంపీ అద్యక్షులు కోన సత్యనారాయణ ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ దేశంలో ప్రాచీన కాలం నుంచి అందుబాటులో ఉన్న వైద్యం ఆయుర్వేద వైద్యం అని పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్యాన్ని ఎందరో మహానుభావులు సాధన చేసి అందులో నిష్ఠాతులయ్యారన్నారు. దీనికి మూలపురుషుడుగా భావించే ధన్వంతరి మానవులకు ఆయుర్వేద జ్ఞానాన్ని అందించాడన్నారు. సూర్య భగవాన్ వద్ద ఆయుర్వేదం నేర్చుకున్న ధన్వంతరి 16 మంది శిష్యుల్లో ఒకడని చెప్పారు. దీపావళికి ముందు వచ్చే ఆశీయుజ బహుళ త్రయోదశి రోజు ఆరోగ్యానికి...
విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, రాయవరం
రాయవరం సబ్ స్టేషన్ పరిధిలో రాయవరం 11కెవి టౌన్ 2, మాచవరం ఫీడర్ల పరిధిలో మరమ్మత్తుల నిమిత్తం రాయవరం,మహేంద్రవాడ,మాచవరం గ్రామాలకు అక్టోబర్ 18 శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు శుక్రవారం తెలిపారు. దీనికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పదిమంది కార్మికుల మృతి
అండగా ఉంటామని నాయకుల నోటిమాట, అర్థం కాని కూటమి ప్రభుత్వ పోకడ
శనివారం లోపు పరిహారం ప్రకటించక పోతే, బాధిత కుటుంబాలతో కలిసి ఉద్యమం బాట.
పీ.డీ.ఎస్.యూ, ఏ.ఐ.కె.ఎం.ఎస్, ఎం.ఆర్.పి.ఎస్., ఎస్.సీ, బీ.సీ, మైనార్టీ ప్రజా సంఘాల హెచ్చరిక
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం గ్రామ శివారులో శ్రీ గణపతి ఫైర్‌వర్క్స్ బాణాసంచా తయారీ కర్మాగార కేంద్రంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకమని, ఘటన జరిగి వారం రోజులు గడిచినా నష్టం పరిహారం పై ప్రకటన లేని ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీ.డీ.ఎస్.యూ, ఏ.ఐ.కె.ఎం.ఎస్., ఎం.ఆర్.పి.ఎస్.,...
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
మండపేట 12 వార్డు లో ఇటీవల మృతి చెందిన బీరక వీర మల్లయ్య కుటుంబ సభ్యుల ను మాజీ మునిసిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ సోమవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలచర్ల బ్రహ్మాజీ, యర్రమాటి సత్యనారయణ, సిరంగి ఈశ్వర్ రావు, దొంత్తం శెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
జనవిజ్ఞాన వేదిక నవ్యాంధ్ర రాష్ట్ర ప్రథమ అధ్యక్షుడు, మండపేట పట్టణానికి చెందిన ప్రముఖ హోమియో వైద్యుడు సామాజిక కార్యకర్త డాక్టర్ చల్లా రవి కుమార్ మాతృమూర్తి లక్ష్మి (81) కన్నుమూశారు. శనివారం రాత్రి 10 గంటలకు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా స్వర్గీయ లక్ష్మి భౌతిక కాయాన్ని సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ జిల్లా కోశాధికారి కామ్రేడ్ కే కృష్ణవేణి, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు గండి స్వామి ప్రసాద్, లయన్ కురసాల వీర వెంకట సత్యనారాయణ, ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సభ్యులు అద్దేపల్లి వీర్రాజు తదితరులు భౌతిక కాయనికి నివాళులర్పించారు
కొద్దిపాటి నిల్వలైనా ప్రమాదకరంగా మారవచ్చు
బాణాసంచా అక్రమ నిల్వలు గుర్తిస్తే 112 లేదా 100 కు సమాచారం అందించాలి.
రామచంద్రపురం డిఎస్పీ రఘువీర్
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
అక్రమంగా బాణాసంచా నిల్వ చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ హెచ్చరించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం పోలీస్ స్టేషన్ లో శనివారం ఆయన మీడియా ద్వారా, దీపావళి పండుగ సందర్భంగా, ప్రజల భద్రత దృష్ట్యా కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా ఇళ్ళ వద్ద బాణాసంచా తయారీ లు చేపట్టినా, ఇంట్లో బాణాసంచా నిల్వ చేసినా సమాచారం ఇవ్వాలని , అమ్మకాలు, తయారీకి సంబంధించిన చట్టబద్ధమైన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా...
శెట్టి బలిజ సామాజిక వర్గ నేతలతో కలిసి బాధితులకు పరామర్శ
నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు
మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి..
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
మద్యం మత్తులో ఆటో డ్రైవర్, ప్రయాణికులపై దాడి చేసిన ఘటనలో బాధితులైన వాసంశెట్టి రామకృష్ణ, అనుసూరి అన్నపూర్ణ తదితరులను మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ మంగళవారం వి.సావరం గ్రామంలో వారి గృహం వద్ద పరామర్శించి,వారిని ధైర్య పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన నిందితుల నేర స్వభావానికి నిదర్శనమని ఇట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని పేర్కొన్నారు. ఈ సమస్య కేవలం ఒక సామాజిక వర్గానికి చెందినది కాదని, నిందితుల వెనుక ఉన్నది ఎంతటి పెద్ద...
ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆశావర్కర్ల నిరసన కార్యక్రమం
ఆరోగ్య కేంద్ర సిబ్బంది కి వినతిపత్రం అందజేత
విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం
కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశావర్కర్లు గా మార్పు చేసి, అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని కోరుతూ,మండల కేంద్రమైన రాయవరంలో గల స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశావర్కర్ల యూనియన్ లీడర్ జి.దుర్గ ఆద్వర్వంలో ఆశావర్కర్లు నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా యూనియన్ లీడర్ దుర్గ మాట్లాడుతూ ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని రకాల జాతీయ సెలవులు, పండుగ సెలవులు, వారాంతపు సెలవు, క్యాజువల్ శెలవులు, మెడికల్ శెలవులు వంటివి తమకివ్వాలని, నాణ్యమైన యూనిఫామ్ లు తమకివ్వాలని, ఏఎన్ఎం, జిఎన్ఎం శిక్షణ పొందిన ఆశా లకు...
విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, రాయవరం
రాయవరం మండలంలోని రాయవరం,వెదురుపాక, వెదురు పాక సావరం, గ్రామాలకు అక్టోబర్ 04 శనివారం ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు శుక్రవారం వారం ప్రకటన ద్వారా తెలిపారు. రాయవరం సబ్ స్టేషన్, వెదురుపాక 11 కెవి ఫీడర్ పరిధిలో లైన్ల మరమ్మత్తుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, దీనికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.