20 October 2025
Monday, October 20, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

కిడ్స్ వాయిస్

సైలెన్సర్లు తీసి బైక్ నడిపిన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చిన సిఐ

అమలాపురం సైలెన్సర్ తీసివేసి రోడ్లపై అధిక శబ్దం చేస్తూ ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్న యువకులకు అమలాపురం పట్టణ సీఐ వీరబాబు కౌన్సిలింగ్ ఇచ్చారు. పేరూరు సెంటర్లో సైలెన్సర్లు తీసి హడావిడి చేసిన యువకుల వీడియోలు సోషల్ మీడియాలో‌ వైరల్ అయ్యాయి. పోలీసులు సైలెన్సర్లు తీసి తిరిగిన యువకులను గుర్తించారు. బైకులను పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. మరోసారి చేస్తే కేసులు నమోదు చేస్తామని సిఐ వీరబాబు యువలకులను హెచ్చరించారు.

ప్రతిభా పురస్కారాలు అందించిన స్వచ్ఛంద సేవా సంస్థలు

కాట్రేనికోన మండలం ప్రతిభ పురస్కారాలు అందించిన స్వచ్ఛంద సేవా సంస్థ స్థానిక మండలం పల్లంకుర్రు పంచాయతీ పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, సాపేవారిపల్లిలో ప్రధానోపాధ్యాయురాలు ఐ.సుధ అధ్యక్షతన కమిడి నీలయ్య ఫౌండేషన్ వారు 2024-25 విద్యాసంవత్సరంలో 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఐ .సుధ మాట్లాడుతూ కన్నతల్లికి, పుట్టిన ఊరికి సేవ చేసుకోవడం చాలా గొప్ప విషయమని, ఈ రోజు కమిడి నీలయ్య ఫౌండేషన్ వారు చేస్తున్న సేవలు ఆదర్శనీయమని అన్నారు. గత సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రథమ స్థానం సాధించిన యాళ్ళ...

31 వేల ఎకరాలకు జీవధార ..తాళ్లూరు లిఫ్ట్ మరమ్మతులకు 52 కోట్ల నిధుల మంజూరు

ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు రైతులు చేసిన పాలాభిషేకంతో ప్రతిధ్వనించిన కృతజ్ఞత విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరులో గల పుష్కర అంతర్భాగం తాళ్లూరు లిఫ్ట్ మరమ్మతులకు ప్రభుత్వం 52 కోట్ల రూపాయలు విడుదల చేసిన సందర్భంగా తాళ్లూరు లిఫ్ట్ వద్ద పుష్కర ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అడబాల భాస్కరరావు, ఆధ్వర్యంలో రైతులతో కలిసి పాలాభిషేకం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను రైతులందరూ కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా పుష్కర అంతర్భాగమైన తాళ్లూరు లిఫ్ట్ సిమెంట్ పైపులు పూర్తిగా పాడై 31 వేల ఎకరాలకు...

పీఎంపీ లకు అవయవ దానం పై అవగాహన

మరణానంతరం అవయవాలు దానం తో మరో పది మంది ప్రాణాలు కాపాడవచ్చు - సన్ స్టార్ హాస్పిటల్ వైద్యులు జమ్ము డాక్టర్ కోదండరామ్, డాక్టర్ నక్కా సుధాకర్ విశ్వం వాయిస్ న్యూస్, అనపర్తి మరణానంతరం అవయవాలు దానం తో మరో పది మంది ప్రాణాలు కాపాడవచ్చని రాజమండ్రి కి చెందిన సన్ స్టార్ హాస్పిటల్ వైద్యులు జమ్ము డాక్టర్ కోదండరామ్, డాక్టర్ నక్కా సుధాకర్ లు అన్నారు.బుధవారం పొలమూరు శ్రీనివాసం ఫంక్షన్ హాల్ నందు కమ్యూనిటీ పారామెడిక్స్ & ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పీఎంపీ అసోసియేషన్) అనపర్తి, బిక్కవోలు మండలాల ఆధ్వర్యంలో ప్రపంచ అవయవదాన దినోత్సవం పురస్కరించుకుని అవగాహన సదస్సు మండల వాసంశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ...

విద్యార్థులకు వ్యవసాయ పంటలపై అవగాహన కార్యక్రమం

విద్యార్థులకు వ్యవసాయ పంటలపై అవగాహన కార్యక్రమం విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్ కరప మండలం నడకుదురు గ్రామం మండల ప్రజా పరిషత్ మోడల్ పాఠశాల, నడాకుదురు నెంబరు1 కరప మండలం నందు విద్యార్థులకు క్షేత్ర పర్యటనలో భాగంగా స్థానికంగా గల పంట పొలంకు పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయుడు వాకాడ వెంకటరమణ తీసుకుని వెళ్లి విద్యార్థులచే వరి నాట్లు, నాటుటపంటలు పెంచుట గురించి అవగాహన కల్పించారు, విద్యార్థులు ఏరువాక సాగు గురించి తెలుసుకున్నారు. స్థానికంగా గల రైతులతో విద్యార్థులు ముచ్చటించారు. పంట ఎదుగుదల,కలుపు తీయడం, ఎరువులు వేయడం, మందుల పిచికారి, గురించి తెలుసుకున్నారు.పంటను చేతికి వచ్చేవరకు అన్నదాత 180 రోజులు పాటు ఎంతో శ్రమ పడతారని తెలుసుకున్నారు.మొదలగు విషయాలు అన్ని రైతులను అడిగి...

ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఆంధ్రప్రదేశ్ 🌞ఏపీలో ఏడుగురు IAS అధికారుల బదిలీ ▪నెల్లూరు జిల్లా కందుకూరు సబ్‌కలెక్టర్‌గా దమీరా హిమవంశీ బదిలీ ▪మన్యం జిల్లా పాలకొండ-పవార్ సప్నిల్‌, ఏలూరు జిల్లా నూజివీడు-బొల్లిపల్లి వినూత ▪అన్నమయ్య మదనపల్లి-చల్లా కల్యాణి, రాజంపేట- HS భావన బదిలీ ▪అల్లూరి జిల్లా రంపచోడవరం-శుభం నొక్వల్‌, పార్వతీపురం-ఆర్ వైశాలి బదిలీ. 🌞ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు దరఖాస్తు గడువు పెంపు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును 10/08/2025 అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగిస్తూ APPSC నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో (ttps://psc.ap.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 🌞ఏపీలో...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo