20 October 2025
Monday, October 20, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

Religion

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్ రాణి…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట పట్టణ ప్రజలందరికీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పతివాడ నూక దుర్గారాణి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం దీపావళి పండుగ సందర్భంగా ప్రజలంతా పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని ఆమె ఆకాక్షించారు.చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటారన్నారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లోనూ సరికొత్త వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు.

రావి చెట్టు సెంటర్ లో దేవీ నవరాత్రుల రాట ముహూర్తం…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట మున్సిపల్ గ్రంథాలయం వద్ద రావి చెట్టు సెంటర్లో వెలిసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి సన్నిధి నందు ఆదివారం ఉదయం దేవీ నవరాత్రుల పందిరి రాట ముహూర్తం చేయడం జరిగింది. రానున్న దేవీ నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారి భక్తులు భవానీ దీక్ష స్వీకరించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ విజయదుర్గ అమ్మవారిని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలతో అమ్మవారిని అహర్నిశలు కొలుస్తారు.భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవతగా ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

జాతీయ న్యాయ చంద్రిక పురస్కారం దక్కించుకున్న ” తణుకు సాయి మాదవి “

విశ్వం వాయిస్ న్యూస్, అన్నవరం ఎల్.సి.ఈ.ఎఫ్ నేషనల్ ఫౌండేషన్ జాతీయ ఆధ్యాత్మిక సాంస్కృట్ వారి ఆధ్వర్యంలో శ్రీ రామా సత్యనారాయణ స్వామి (అన్నవరం)వారి దేవస్థానం లో జరిగిన కార్యక్రమంలో శివసాయి కూచిపూడి నృత్య కళా క్షేత్రం నిర్వహకురాలు తణుకు సాయి మాదవికి జాతీయ న్యాయ చంద్రిక పురస్కారం దక్కించుకోవటం పట్ల కూచిపూడి విద్యార్థిణిలు వారి ఆనందాలను వ్యక్తం చేశారు.  ఆమెకు దక్కిన పురష్కారం కూచిపూడి నృత్యానికి వన్నె తెచ్చిపెట్టిందని , ఆమెకు దక్కిన పురష్కారం ఇంటర్నెషనల్ వరల్డ్ రికార్డ్ ల్లో ఒక్కటని,ఆమె ఎంతో పురాతన మైన సాహితి నగరం రాజమంద్రి వాసి కావటం మన నగర ప్రతిష్ట కు ముత్యాల హారం వంటిదని,ఆమె ఎంతో మంది చిన్నారులను కూచిపూడి శిక్షణలో త్వర్పిదు నిచ్చి జాతీయ...

విద్యార్థి స్థాయి నుండి దేశభక్తిని పెంపొందించాలి – భారత వికాస్ పరిషత్ సభ్యులు జీ వి బీ సుబ్రహ్మణ్యం

భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దేశభక్తి గీతాల పోటీలు   విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు విద్యార్థి స్థాయి నుండి దేశభక్తిని పెంపొందించేందుకు భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి దేశభక్తి గీతాలు పోటీలను నిర్వహించడం జరుగుతుందని భారత వికాస్ పరిషత్ సభ్యులు జీ వి బీ సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం కొవ్వూరు పట్టణంలోని ఆంధ్ర గీర్వాణి విద్యాపీఠం సంస్కృత కళాశాల నందు విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తి గీతాలు పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జి వి బి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులు సంయుక్తంగా కలిసి దేశభక్తి గీతాన్ని ఆలపించాలనే సంకల్పంతో భారత వికాస్ పరిషత్ ఆధ్వర్యంలో దేశభక్తి గీతాలు పోటీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చిన్ననాటి నుండి దేశం పట్ల భక్తి గౌరవాలను పెంచుకునే...

గణేష్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట అన్ని దానాలలో అన్నదానం అత్యున్నతం అని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ మండపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ అన్నారు. గణపతి నవరాత్రి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని రెండవ వార్డు గొల్లలగుంట వీధిలో గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం భారీ అన్నదాన సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో లీలాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించికుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆ వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్, వార్డు ప్రముఖులు నాగులాపల్లి ఈశ్వరరావు, చిట్టూరి గణేష్, కేతా వెంకటరమణ, పెంకే వీరబాబులు అన్నదానం ప్రారంభించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గణేష్ యూత్ కమిటీ సభ్యులు రాత్రి నుంచే శ్రమించి పలు...

వేములూరు శ్రీ విజయ గణపతి ఆలయం నందు భారీ అన్న సమారాధన

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ విజయ గణపతి ఆలయం నందు వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిసాయి. శ్రీ విజయ గణపతి స్వామి వారి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం వేములూరు గ్రామంలోని శ్రీ విజయ గణపతి ఆలయం నందు భారీ అన్న సమారాధన నిర్వహించారు. సుమారు మూడు వేల మంది భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వేములూరు గ్రామంలో గత 42 సంవత్సరముల నుండి శ్రీ విజయ గణపతి వారి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నవరాత్రుల సమయంలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలను అందించడం జరుగుతుందన్నారు....

చిందాడ గరువు రామాలయం సెంటర్ వినాయకుని ప్రసాదం దక్కించుకున్న రమేష్

అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం చిందాడ గరువు రామాలయం సెంటర్ లో వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి వారిదగ్గర తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న స్వామివారి ఐదు కేజీల లడ్డు ప్రసాదం ను కాజా నాగేశ్వరరావు కుమారుడు రమేష్ వేలంపాటలో 61000 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సందర్బంగా వరసిద్ధివినాయక కమిటీ వారు రమేష్ ను శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం ను అందజేశారు. వేలం పాట లో స్వామి వారి లడ్డు తమకు దక్కడం అదృష్టం గా భవిస్తున్నామని కాజా నాగేశ్వరరావు మరియు వారికుమారుడు రమేష్ సంతోషం వ్యక్తం చేసారు.ఈ లడ్డు వేలంపాట కార్యక్రమం లో బొంతు...

జమాతె ఇస్లామీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సత్కారం…

ఉపాధ్యాయులు సమాజానికి స్ఫూర్తి దాయకం... విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట ఉపాధ్యాయదినోత్సవం ను పురస్కరించుకొని జమాతె మహిళా విభాగం ఆధ్వర్యంలో మండపేట గాంధీనగర్ అల్-ఆమీన్ మస్జిద్ ప్రాంగణంలో ఆదివారం కార్యక్రమం నిర్వహించారు. మౌలానా జలాలుద్దీన్ ఉమ్రి అడిటోరియం‌ హల్ లో సత్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జమాతె మహిళా విభాగాపు అధ్యక్షురాలు అయేషా మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.ఇస్లాం విద్యకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు విద్యావంతులే సత్ససమాజ నిర్మణాంలో భాగస్వాములవుతారని అన్నారు.అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి దివ్యఖుర్ఆన్ ను బహుకరించారు.ఈ కార్యక్రమంలో ఆధిక సంఖ్యలో మహిళా ఉపాధ్యాయులు, జమాతె మహిళా సభ్యులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

మాజీ ఉపరాష్ట్రపతికి బాలరాముని విగ్రహం బహూకరణ…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు పట్టణానికి చెందిన ప్రముఖ శిల్పి వాసా శ్రీనివాస్ బాలరాముని విగ్రహాన్ని బహూకరించారు. గన్నవరంలోని స్వర్ణభారత్ ట్రస్టులో బీజేపీ సీనియర్ నాయకుడు వల్లూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో మాజీ ఉప రాష్ట్రపతిని శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ పంచలోహాలతో తయారు చేసిన బాలరాముని విగ్రహాన్ని జ్ఞాపికగా అందించారు. శ్రీనివాస్ కళానైపుణ్యాన్ని ప్రశంసించిన ఉపరాష్ట్రపతి, ఎంతో అందంగా తయారైన విగ్రహాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుక్కపల్లి నాగేశ్వరరావు, అయోధ్య తెలుగు వారి నిత్యాన్నదానం ట్రస్ట్ నిర్వాహకులు చల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గణపతిబప్ప మోరియా ఆదా లడ్డు చోరియా…

మండపేట పురవీధుల్లో గణనాథుడి శోభయాత్రతో భక్తులు పరవశం... విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట లో శనివారం గణనాథుడి శోభయాత్ర ఉదయం నుండి సాగింది.9 రోజులు పాటు విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుడుని భక్తిశ్రద్ధలతో పూజించి విశేష పూజలు అందుకుని చివరి రోజైన శనివారం నాడు పట్టణ పురవీధుల్లో భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ గణనాథుడు నిమజ్జన ఘాట్లకు చేరుకున్నాయి. ఆదివారం చంద్రగ్రహణం ఏర్పడడంతో మండపేటలో వెలిసిన చిన్న పెద్ద అన్ని వినాయక ప్రతిమలను నిన్న శనివారం ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులుతో కలసి నిమజ్జనం చేయడం జరిగింది. మండపేటలో కొండపల్లి వారి వీధిలో 20 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు జరుపుతున్న ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సంవత్సరం 18 అడుగులతో...
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo