14 October 2025
Tuesday, October 14, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

పండుగలు

రావి చెట్టు సెంటర్ లో దేవీ నవరాత్రుల రాట ముహూర్తం…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట మున్సిపల్ గ్రంథాలయం వద్ద రావి చెట్టు సెంటర్లో వెలిసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి సన్నిధి నందు ఆదివారం ఉదయం దేవీ నవరాత్రుల పందిరి రాట ముహూర్తం చేయడం జరిగింది. రానున్న దేవీ నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారి భక్తులు భవానీ దీక్ష స్వీకరించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ విజయదుర్గ అమ్మవారిని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలతో అమ్మవారిని అహర్నిశలు కొలుస్తారు.భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవతగా ఇక్కడి ప్రజలు విశ్వసిస్తారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

గణేష్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట అన్ని దానాలలో అన్నదానం అత్యున్నతం అని రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ మండపేట నియోజకవర్గ ఇన్ ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ అన్నారు. గణపతి నవరాత్రి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని పట్టణంలోని రెండవ వార్డు గొల్లలగుంట వీధిలో గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం భారీ అన్నదాన సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో లీలాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించికుని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆ వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్, వార్డు ప్రముఖులు నాగులాపల్లి ఈశ్వరరావు, చిట్టూరి గణేష్, కేతా వెంకటరమణ, పెంకే వీరబాబులు అన్నదానం ప్రారంభించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. గణేష్ యూత్ కమిటీ సభ్యులు రాత్రి నుంచే శ్రమించి పలు...

వేములూరు శ్రీ విజయ గణపతి ఆలయం నందు భారీ అన్న సమారాధన

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీ విజయ గణపతి ఆలయం నందు వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిసాయి. శ్రీ విజయ గణపతి స్వామి వారి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంగళవారం వేములూరు గ్రామంలోని శ్రీ విజయ గణపతి ఆలయం నందు భారీ అన్న సమారాధన నిర్వహించారు. సుమారు మూడు వేల మంది భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వేములూరు గ్రామంలో గత 42 సంవత్సరముల నుండి శ్రీ విజయ గణపతి వారి నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని నవరాత్రుల సమయంలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలను అందించడం జరుగుతుందన్నారు....

చిందాడ గరువు రామాలయం సెంటర్ వినాయకుని ప్రసాదం దక్కించుకున్న రమేష్

అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం చిందాడ గరువు రామాలయం సెంటర్ లో వరసిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి వారిదగ్గర తొమ్మిది రోజులపాటు పూజలు అందుకున్న స్వామివారి ఐదు కేజీల లడ్డు ప్రసాదం ను కాజా నాగేశ్వరరావు కుమారుడు రమేష్ వేలంపాటలో 61000 రూపాయలకు దక్కించుకున్నారు. ఈ సందర్బంగా వరసిద్ధివినాయక కమిటీ వారు రమేష్ ను శాలువాతో సత్కరించి స్వామివారి లడ్డు ప్రసాదం ను అందజేశారు. వేలం పాట లో స్వామి వారి లడ్డు తమకు దక్కడం అదృష్టం గా భవిస్తున్నామని కాజా నాగేశ్వరరావు మరియు వారికుమారుడు రమేష్ సంతోషం వ్యక్తం చేసారు.ఈ లడ్డు వేలంపాట కార్యక్రమం లో బొంతు...

గణపతిబప్ప మోరియా ఆదా లడ్డు చోరియా…

మండపేట పురవీధుల్లో గణనాథుడి శోభయాత్రతో భక్తులు పరవశం... విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట లో శనివారం గణనాథుడి శోభయాత్ర ఉదయం నుండి సాగింది.9 రోజులు పాటు విఘ్నాలు తొలగించే విగ్నేశ్వరుడుని భక్తిశ్రద్ధలతో పూజించి విశేష పూజలు అందుకుని చివరి రోజైన శనివారం నాడు పట్టణ పురవీధుల్లో భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ గణనాథుడు నిమజ్జన ఘాట్లకు చేరుకున్నాయి. ఆదివారం చంద్రగ్రహణం ఏర్పడడంతో మండపేటలో వెలిసిన చిన్న పెద్ద అన్ని వినాయక ప్రతిమలను నిన్న శనివారం ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులుతో కలసి నిమజ్జనం చేయడం జరిగింది. మండపేటలో కొండపల్లి వారి వీధిలో 20 సంవత్సరాలుగా గణపతి నవరాత్రులు జరుపుతున్న ఉత్సవ కమిటీ సభ్యులు ఈ సంవత్సరం 18 అడుగులతో...

సంతాన గణపతి కి చైర్ పర్సన్ రాణి పూజలు…

ఘనంగా నిమజ్జనం... విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట పట్టణం 15వ వార్డు ధర్మగుండం వీధిలో వెలసిన శ్రీ సంతాన గణపతి స్వామి వారి నిమజ్జనం కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఊరేగింపు నిర్వహించి ఘనంగా గణేష్ నిమజ్జనం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మండపేట లో ఘనంగా ఈద్ మిలాదున్నబి వేడుకలు…

అంతర్జాతీయ ఇస్లాం ప్రసంగీకులు డాక్టర్ మహమ్మద్ అహమద్ మిజ్ బాహి ప్రసంగించారు... విశ్వం వాయిస్ న్యూస్, మండపేట శాంతి సామరస్యం ద్వారా ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించారని మండపేట జామియా మస్జిద్ ఇమామ్ గులాం మొహమ్మద్ ముర్షిద్ రజ్వీ పేర్కొన్నారు. సోదర భావంతో మెలగాలని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం అందించారని కొనియాడారు. మండపేటలో మహనీయ మహమ్మద్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లెం వారి 1500 వ మిలాద్ వున్ నబీ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జయంతి వేడుకలు సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహించారు. కలువపువ్వు సెంటర్ వద్ద జామియా మస్జిద్ ఇమామ్...

ఘనంగా గణపతి నవరాత్రుల దీపోత్సవం …

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మండపేట పార్థసారధి నగర్ చిన్న మజీద్ వెనుక కొండయ్య బీడులో శ్రీ లక్ష్మీ గణపతి డ్రాగన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేష్ మండపం వద్ద బుధవారం రాత్రి దీపోత్సవం వైభవంగా జరిగింది. వైఎస్సార్సీపీ యువజన విభాగం నియోజకవర్గ కన్వీనర్ చోడే శ్రీకృష్ణ జాహ్నవి స్వరూప దంపతులు దీపోత్సవంను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ మాట్లాడుతూ 19 ఏళ్లుగా నిర్విఘ్నంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న డ్రాగన్ యూత్ సభ్యులను అభినందించారు. దీపోత్సవంలో భాగంగా మట్టి విగ్రహాలను తయారుచేసి దీపాలతో అలంకరించారు. పార్థసారథి నగర్, గాంధీనగరం పరిసర ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని దీపాలు...

లడ్డూని దక్కించుకున్న కౌన్సిలర్ చిట్టూరి సతీష్…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట పట్టణంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం 8వ రోజున మండపాల్లో కొలువైన గణపయ్యలకు విశేష పూజలు చేశారు. ఈ క్రమంలో 3 వ వార్డు శ్రీనగర్ వీధిలో వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో ప్రత్యేక దీపాలంకరణ చేసి లడ్డూ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వార్డు కౌన్సిలర్ చిట్టూరి సతీష్ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం లడ్డూ వేలంలో పాల్గొని, రూ 2010 నుంచి ప్రారంభమైన పాటలో రూ.12,555కి లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. 2010 నుంచి ఆయన నిరంతరంగా లడ్డూ ప్రసాదాన్ని పొందుతూ వస్తుండటం విశేషం. ఈ ఏడాదీ ఆనవాయితీని కొనసాగించడంతో లక్ష్మీ గణపతి అనుగ్రహంతో...

ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి గరికి పూజ 108 రకాల మహా నైవేద్యం

విశ్వం వాయిస్ న్యూస్, కొవ్వూరు గణపతి నవరాత్రి వేడుకల్లో భాగంగా కొవ్వూరు పట్టణంలోని మెరకు వీధి రౌండ్ రామాలయం యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ గణపతి నవరాత్రి వేడుకలలో ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం స్వామివారికి గరికి పూజ 108 రకాల మహా నైవేద్యాన్ని సమర్పించారు. మహిళలు విశేషంగా పాల్గొని స్వామివారికి గరిక పూజలు నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలలో ఆలయ కమిటీ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మహా నైవేద్యాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో రౌండ్ రామాలయం యూత్ గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo