విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట
క్రీడలను ఎప్పుడు ప్రోత్సహించే మాధవి ఆయిల్స్ అధినేత వేగుళ్ళ కృష్ణ చైతన్య బాబు స్థానిక విజయలక్ష్మి నగర్ శివారు బైపాస్ రోడ్డు నందు యువతకు ఉపయోగకరమైన మాధవి స్పోర్ట్స్ బాక్సులను బుధవారం నాడు ప్రారంభించారు. ఇందులో రెండు క్రికెట్ కోర్టులు, ఒక శెట్టిల్ కోర్టు, ఒక వాలీబాల్ కోర్ట్ ,ఒక పింక్ బాల్ కోర్టును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత ఆరోగ్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోజుకి ఒక గంటపాటైన ఆరోగ్యం పట్ల దృష్టి సారించి కసరత్తులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, వేగుళ్ల రేణుకాదేవి, వల్లూరి కుమార్ బాబు, వల్లూరి రామన్న...
- మరలా సెలెక్షన్స్ ఎప్పుడనేది తెలియజేస్తా మన్న అసోసియేషన్
- హాజరైన 19మండలాల క్రీడాకారులు
- రాజమండ్రిలో క్రీడాకారుల కు ఇండోర్ స్టేడియం ఏర్పాటు చెయ్యాలి..
- బురిడీ త్రిమూర్తులు, మల్లికార్జున్
విశ్వం వాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం
ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎస్‌కేవీటీ డిగ్రీ కాలేజి క్రీడా మైదానంలో జూనియర్స్ కబడ్డీ బాయ్స్, గర్ల్స్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు.తూర్పు గోదావరి జిల్లా 19 మండలాల నుండి 250 మంది బాలురు,150 మంది బాలికలు కబడ్డీ ఎంపికకు హాజరయ్యారు. ఈసందర్బంగా తూర్పు గోదావరి జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ బురిడి త్రిమూర్తులు మాట్లాడుతూ క్రికెట్ తర్వాత కబడ్డీ క్రీడకు ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నారు.ఈమధ్య ప్రో కబడ్డీ లీగ్స్...
విశ్వం వాయిస్ పాలిటికల్ డెస్క్, మండపేట
క్రీడల్లో రాణించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చు అని అంతేకాకుండా క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహద పడతాయని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇండోర్ స్టేడియం లో 49 వ రాష్ట్ర స్ధాయి టెన్నికాయిట్ చాంఫియన్ షిప్ పోటీలు నిర్వహించారు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేగుళ్ళ ముఖ్య అతిధిగా పాల్గొని పోటీలు ప్రారంభించారు.చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్ధులు క్రీడల్లో ప్రావీణ్యం సంపాదించాలన్నారు. క్రీడల్లో రాణించడం...
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రావులపాలెం విద్యార్థులుఈ నెల 22 వ తేది నుంచి 24 వ తేదీ వరకు కర్నూలు లో జరిగే రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ అండర్ 19 విభాగమునకు డాన్ బోస్కో హైస్కూలుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయినట్లు ప్రిన్సిపాల్ జె. విద్యాసాగర్ తెలిపారు
విశ్వం వాయిస్ స్పోర్ట్స్ డెస్క్, రావులపాలెం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రావులపాలెం విద్యార్థులుఈ నెల 22 వ తేది నుంచి 24 వ తేదీ వరకు కర్నూలు లో జరిగే రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ అండర్ 19 విభాగమునకు డాన్ బోస్కో హైస్కూలుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయినట్లు ప్రిన్సిపాల్ జె....
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, జగ్గంపేట
ఈ నెల 9, 10 తేదీల్లో గుంటూరులో నిర్వహించిన సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ జూడో చాంపియన్‌షిప్‌లో కాకినాడ జిల్లా జగ్గంపేట భాష్యం స్కూల్ కి చెందిన బత్తుల తేజస్వి ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించి, జాతీయస్థాయికి అయ్యారని ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ రెడ్డి సత్యనారాయణ తెలియజేశారు. సెప్టెంబర్ 8వ తేదీన హర్యానాలో జరిగే జాతీయస్థాయి జూడో పోటీల్లో పాల్గొంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వారు తేజస్విని సత్కరించి జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమెకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, జోనల్ ఇన్చార్జ్ గోవిందరాజు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ ప్రిన్సిపాల్ వాణి, విద్యార్థిని తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఘనంగా సత్కరించి ఆశీస్సులు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట
కాకినాడ జిల్లా జగ్గంపేట డి ఫిట్నెస్ జిమ్ అధినేత తాండ్రోతు వీర వెంకటరమణ ఆధ్వర్యంలో జగ్గంపేట నుండి గుంటూరులో ఆగస్టు9,10 తేదీలలోజరిగిన రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో జగ్గంపేట విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించిన బి తేజస్విని, సిల్వర్ మెడల్ సాధించిన కె యేసు రాజు, రజతం సాధించిన ముగ్గురు విద్యార్థులు బి నిఖిల్ సాత్విక్, టీ వైష్ణవి ను ,పి .జైపాల్ లను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘనంగా సత్కరించి ఆశీస్సులు అందించారు. వీరిలో గోల్డ్ మెడల్ సాధించిన భాష్యం స్కూల్ విద్యార్థిని బి తేజస్విని, సిల్వర్ మెడల్ సాధించిన గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థి కే...
ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఆంధ్రప్రదేశ్
🌞ఏపీలో ఏడుగురు IAS అధికారుల బదిలీ
▪నెల్లూరు జిల్లా కందుకూరు సబ్‌కలెక్టర్‌గా దమీరా హిమవంశీ బదిలీ
▪మన్యం జిల్లా పాలకొండ-పవార్ సప్నిల్, ఏలూరు జిల్లా నూజివీడు-బొల్లిపల్లి వినూత
▪అన్నమయ్య మదనపల్లి-చల్లా కల్యాణి, రాజంపేట- HS భావన బదిలీ
▪అల్లూరి జిల్లా రంపచోడవరం-శుభం నొక్వల్, పార్వతీపురం-ఆర్ వైశాలి బదిలీ.
🌞ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు దరఖాస్తు గడువు పెంపు
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును 10/08/2025 అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగిస్తూ APPSC నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో (ttps://psc.ap.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
🌞ఏపీలో...
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా సానా సతీష్ బాబు నామినేషన్ దాఖలు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మంగళగిరి
ఈ నెల 16వ తేదీన జరగనున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ 2025-2028 ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు ప్రక్రియ మొదలైంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా రాజ్యసభ సభ్యులు, సానా సతీష్ బాబు ఆదివారం మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చాంబర్లో తన నామినేషనన్ను దాఖలు చేసారు. తన అభిమానులు, స్నేహితులతో కలిసి సానా సతీష్ బాబు తరలి వెళ్ళి నామినేషన్ పత్రలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సమర్పించారు.
రాష్ట్రస్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్ క్రీడా పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపిక
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్
రాష్ట్రస్థాయి సౌత్ జోన్ క్రీడా పోటీలకు మాదపట్నం జడ్పీ పాఠశాలకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు టి.మురళీకృష్ణ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 3న పెద్దాపురం మహారాణి కాలేజీ క్రీడా మైదానంలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ముగ్గురు క్రీడాకారులు ప్రతిభ కనబరిచారన్నారు. వీరు అండర్ - 18 విభాగంలో డి. రాజేష్ (1000 మీ) ప్రథమ స్థానం, ఎన్. యుగేష్ (400 మీ) ద్వితీయ స్థానం, అండర్- 14 విభాగంలో ఆర్.పవన్ గణేష్ (జావెలిన్) ప్రథమ స్థానాలు సాధించి రాష్ట్రస్థాయి సౌత్ జోన్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వీరు ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు బాపట్లలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థులకు...
అమలాపురం టౌన్
అమలాపురం రీజియన్ ఎస్బిఐ ఎంప్లాయీస్ రీజనల్ స్పోర్ట్స్ మీట్ స్థానిక ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్ లో ఆదివారం నాడు నిర్వహించారు. రీజియన్ నలుమూలల నుండి అధిక సంఖ్యలో ఉద్యోగులు ఉత్సాహం గా పాల్గొన్నారు. షటిల్ బ్యాడ్మింటన్, చెస్ , కార్రమ్స్ మరియు టేబుల్ టెన్నిస్ పోటీలు నిర్విహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ అశోక్ నాగరాజన్ , ఎస్బిఐ స్టాఫ్ యూనియన్ రీజనల్ సెక్రెటరీ వై గణేష్ సబ్ స్టాఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం వేంకటేశ్వర రావు , ఆఫీసర్స్ అసోసియేషన్ జోనల్ సెక్రెటరీ సురేష్ హెచ్ఆర్ మేనేజర్ రవికాంత్ మరియు అధిక సంఖ్యలో ఉద్యోగులు, మహిళా ఉద్యగులు ఉత్సాహంగా పాల్గొన్నారు.