అమలాపురం
గౌడ అనే పదాన్ని ముందుగా వాడరాదని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
బిసి బి జాబితాలోకి గీత కులాలు సీరియల్ నెంబర్ ఫోర్ గా సవరించిన ప్రభుత్వం
ఇకపై గీత కులాలకు జారీ చేసే కుల సర్టిఫికెట్లు సంబంధిత కులానికి మాత్రమే ప్రత్యేకంగా పేరు రాయాలి ఉదాహరణకు ఈడిగా, గౌడ, (గమల్లు) కళాలి గౌండ్ల, శెట్టిబలిజ, శ్రీశైయన, ఇలా మాత్రమే వ్రాయాలి గౌడ్ అనే పదాన్ని ముందుగా వాడరాదు అని ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది సంబంధిత సాఫ్ట్వేర్ లో మార్పులు చేసి కుల ధ్రువపత్రాలు జారీ చేసేటప్పుడు అభ్యర్థి ఏ కులానికి చెందినవాడు అదే పేరు మాత్రమే వాడాలి అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
334 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించిన ఎన్నికల కమిషన్
విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, ఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్
*334 గుర్తింపు లేని రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించిన ఎన్నికల కమిషన్*
▪️దేశంలో మొత్తం 2854 రిజిస్టర్ అయ్యి.. గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉన్నాయి.
▪️వీటిలో 334 పార్టీలు వరుసగా 6 సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో డీ-లిస్ట్ అయ్యాయి.
▪️ఇప్పుడు మిగిలినవి 2520 మాత్రమే.
*తొలగించడానికి కారణాలు*
▪️6 సంవత్సరాలు పోటీ చేయలేదు.
▪️చిరునామా, పదవిదారుల వివరాలు అప్డేట్ చేయలేదు.
▪️ECI నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు.
*డీ-లిస్ట్ అయిన పార్టీలకు ఇకపై*
▪️పన్ను మినహాయింపు లభించదు.
▪️ఎన్నికల గుర్తు రిజర్వేషన్ ప్రయోజనాలు ఉండవు.
ఏపీలో కొత్త రైల్వే లైను నిర్మాణానికి ప్రతిపాదనలు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి, విజయవాడ
*ఏపీలో కొత్త రైల్వేలైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు.*
మొత్తం 1,336 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ల నిర్మాణం.
రూ.2,982 కోట్ల వ్యయమవుతుందని అంచనా.
భద్రాచలం-కొవ్వూరు 70 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ల నిర్మాణం.
ముద్దనూరు-పులివెందుల-ముదిగుబ్బ-శ్రీసత్యసాయి 105 కిలోమీటర్లు.
అట్టిపట్లు-పుత్తూరు 30 కిలోమీటర్లు, 205 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు.
రాష్ట్రంలో బహుళ అంతస్తుల భవనాలకు 72 గంటల్లో పర్మిషన్ !
విశ్వం వాయిస్ స్పెషల్ రిపోర్ట్ టీం, విజయవాడ
ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణాల అనుమతుల్ని ప్రభుత్వం తేలిక చేస్తోంది. ఇప్పటికే ఐదు అంతస్తుల వరకూ సెల్ఫ్ డిక్లరేషన్ తో ఆన్ లైన్ లోనే అనుమతులు తీసుకునే అవకాశం కల్పించింది. ఇప్పుడు బహుళ అంతస్తుల నిర్మాణాల అనుమతుల్ని కూడా సులభతరం చేస్తోంది. పట్టణాభివృద్ధిని వేగవంతం చేయడానికి , “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”ను ప్రోత్సహించడానికి బహుళ అంతస్తుల భవనాలకు 72 గంటల్లో అనుమతులు ఇవ్వడానికి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను ప్రవేశపెట్టింది. ఈ విధానం 12 అంతస్తులు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న భవనాల నిర్మాణ అనుమతులను 72 గంటల్లో జారీ చేయడానికి ఉపయోగపడుతుంది. నెలల తరబడి జాప్యం అయ్యే అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.మంగళగిరిలోని డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ కార్యాలయంలో...
ఆంధ్రప్రదేశ్ వార్తలలోని ఈరోజు ముఖ్యాంశాలు
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ఆంధ్రప్రదేశ్
🌞ఏపీలో ఏడుగురు IAS అధికారుల బదిలీ
▪నెల్లూరు జిల్లా కందుకూరు సబ్‌కలెక్టర్‌గా దమీరా హిమవంశీ బదిలీ
▪మన్యం జిల్లా పాలకొండ-పవార్ సప్నిల్, ఏలూరు జిల్లా నూజివీడు-బొల్లిపల్లి వినూత
▪అన్నమయ్య మదనపల్లి-చల్లా కల్యాణి, రాజంపేట- HS భావన బదిలీ
▪అల్లూరి జిల్లా రంపచోడవరం-శుభం నొక్వల్, పార్వతీపురం-ఆర్ వైశాలి బదిలీ.
🌞ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు దరఖాస్తు గడువు పెంపు
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి APPSC నోటిఫికేషన్ ఆన్లైన్ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును 10/08/2025 అర్ధరాత్రి 11.59 గంటల వరకు పొడిగిస్తూ APPSC నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లో (ttps://psc.ap.gov.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
🌞ఏపీలో...
కాకినాడ పోర్టు రైల్వే స్టేషన్లలో డిఆర్ఎమ్ తనిఖీలు.
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ
కాకినాడ : విజయవాడ రైల్వే డివిజన్ డిఆర్ఎమ్ మోహిత్ సోనాకియా కాకినాడ రైల్-పోర్ట్ మౌలిక సదుపాయాల సమగ్ర తనిఖీని నిర్వహించారు.భద్రత, సరుకు రవాణా సామర్థ్యం మరియు సిబ్బంది సంక్షేమంపై దృష్టి సారించాలని రైల్వే అధికారులను ఆదేశించారు.దక్షిణ మధ్య రైల్వేలోని విజయవాడ డివిజన్లోని డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) మోహిత్ సోనాకియా ఆదివారం కాకినాడ ప్రాంతంలోని కీలకమైన రైల్వే మౌలిక సదుపాయాలను విస్తృతంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ కాకినాడ టౌన్ స్టేషన్, కాకినాడ పోర్ట్ స్టేషన్ మరియు కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (KSPL) లలో విస్తరించి,సరుకు రవాణా నిర్వహణ, భద్రతా సంసిద్ధత మరియు సిబ్బంది సౌకర్యాలను పరిశీలించారు.కాకినాడ...
తెలంగాణకు బుల్లెట్ ట్రైన్
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, హైదరాబాద్
తెలంగాణకు బుల్లెట్ రైలు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీకి ప్రతిపాదనలు సమర్పించారు.ప్రధాన నగరాలైన చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ మీదుగా బుల్లెట్ రైలు మార్గం ఉండేలా ఈ ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు పనులు జరుగుతున్నాయి.
ఇద్దరు బాలికల ఆచూకీనితెలుసుకున్న పోలీసులు
సిబ్బందిని అభినందించిన సిఐ
విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్
ఎస్ అచ్యుతాపురం నివాసి తంగేళ్ల సూర్య నాగమ్మ (భర్త నరసయ్య, 33 సం.) తమ కుమార్తె సోమవారం ఉదయం కళాశాలకు వెళ్లిన తర్వాత కనిపించకుండా, రామారావుపేట లోని సంజీవ్ జూనియర్ కాలేజ్ నుండి వెళ్లిపోయిన తంగెళ్ల లావణ్య మైనర్ కుమార్తె తో వెళ్లి పోయినదని తెలిసి రాత్రి పొద్దుపోయిన తర్వాత అందిన ఫిర్యాదుతో,ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎమ్. వీరబాబు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, కాకినాడ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అఫ్ పోలీసు పాటిల్ దేవరాజ్ మనీష్ ఆదేశాల మేరకు కాకినాడ రురల్ ఇన్స్పెక్టర్ డీఎస్. చైతన్య కృష్ణ సూచనల మేరకు,...
అమలాపురం
అగ్రి స్టాక్ డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా రైతుల గుర్తింపు భూమి రికార్డులు, పంట డేటా మరియు స్కీమ్ ప్రయోజనాలను సమగ్ర పరిచే సాంకేతికత డిజిటల్ వ్యవస్థని ఆధార్ కార్డు మాదిరిగా రైతుల పూర్తి వివరాలతో 11 అంకెల డిజి టల్ నెంబర్‌ను కేటాయి స్తారని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ వెల్లడిం చారు గురువారం జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ శాఖలైన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధనం, మత్స్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అగ్రీ స్టాక్, డిజిటల్ ప్లాట్ఫారం విధి విధానాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని సేవలను ఒక త్రాటిపైకి తెచ్చి కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ పథకాలు డేటా ఆధారిత సాధనాలను...
విశ్వం వాయిస్ టెక్ డెస్క్,
అమెరికా మోంటానా రాష్ట్రంలో ఒక చిన్న విమానం గల్లంతైన ఘటనలో స్మార్ట్‌వాచ్ కీలకంగా మారింది. విమానం గాల్లోకి లేచిన కొన్ని నిమిషాలకే రాడార్ నుంచి అదృశ్యమైంది. పైలట్‌తో పాటు మిగతా ముగ్గురు ప్రయాణికులు మరణించారు.
శోధన కొనసాగుతున్న సమయంలో స్మార్ట్‌వాచ్ సిగ్నల్
విమాన శకలాల కోసం వెతికిన రెస్క్యూ బృందాలకు ఊహించని దారిని చూపించింది ఒక ప్రయాణికుడి స్మార్ట్‌వాచ్. ఆ డివైస్ నుంచి వచ్చిన లొకేషన్ సిగ్నల్ ఆధారంగా, యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ సమీపంలో ఉన్న ప్రమాద స్థలాన్ని గుర్తించారు. ఈ శకలాలే మిస్సింగ్ విమానానికి చెందినవని అధికారులు ధృవీకరించారు.
పైపర్ PA-28 విమానం
ఈ సింగిల్ ఇంజిన్ విమానం వ్యక్తిగత ప్రయాణం కోసం ఉపయోగించబడింది. గురువారం అర్ధరాత్రి తర్వాత విమానం...