*నాలుగు రోజుల్లోనే దొంగతనం చేసిన ముద్దాయిని అరెస్టు చేసిన రామచంద్రపురం పోలీస్*
అంబేద్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం పట్టణములో రామదుర్గ వీధి లో దొంగతనానికి పాల్పడ్డ ముద్దాయిని అరెస్టు చేసిన పోలీసులు.
కేసు నమోదు చేసిన నాలుగు రోజుల్లోనే దొంగతనం చేసిన ముద్దాయిని అరెస్టు చేసిన
పోలీస్ సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ బి కృష్ణారావు
దంతంశెట్టి శ్రీనివాస్ ఈనెల మూడో తారీఖున ఇంటికి తాళం వేసి విశాఖపట్నం వెళ్లి ఏడో తారీఖున తిరిగి వచ్చేసరికి దొంగతనం చేసి దోచుకుని వెళ్లిన ముద్దాయి
రామచంద్రపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఇంటి యజమాని దంతంశెట్టి శ్రీనివాస్ కేసును చేదించడంలో కీలక పాత్ర పోషించిన రామచంద్రపురం డిఎస్పి రఘువీర్ , సీఐ వెంకట నారాయణను సిబ్బందిని అభినందించిన కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు.
దేవగుప్త వీరబ్రహ్మం దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు దేవగుప్త వీరబ్రహ్మమును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు
సుమారు 50 లక్షల విలువ గల 463 గ్రాముల బంగారం వస్తువులను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు .
ఈ కేసు దర్యాప్తులో అమలాపురం క్రైమ్ సీఐ గజేంద్ర,,రామచంద్రపురం, ద్రాక్షారామం, అమలాపురం ఐటి కోడ్ టీంలు పాల్గొన్నారు