20 October 2025
Monday, October 20, 2025

ఘనంగా ధన్వంతరి జయంతి…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట

కమ్యూనిటీ పారామెడిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ పియంపి అసోసియేషన్ ఆద్వర్యంలో ధన్వంతరి జయంతి శనివారం నిర్వహించారు. జిల్లా పీఎంపీ అద్యక్షులు కోన సత్యనారాయణ ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ దేశంలో ప్రాచీన కాలం నుంచి అందుబాటులో ఉన్న వైద్యం ఆయుర్వేద వైద్యం అని పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్యాన్ని ఎందరో మహానుభావులు సాధన చేసి అందులో నిష్ఠాతులయ్యారన్నారు. దీనికి మూలపురుషుడుగా భావించే ధన్వంతరి మానవులకు ఆయుర్వేద జ్ఞానాన్ని అందించాడన్నారు. సూర్య భగవాన్ వద్ద ఆయుర్వేదం నేర్చుకున్న ధన్వంతరి 16 మంది శిష్యుల్లో ఒకడని చెప్పారు. దీపావళికి ముందు వచ్చే ఆశీయుజ బహుళ త్రయోదశి రోజు ఆరోగ్యానికి సంపదకు ప్రతీకైన ధన్వంతరిని పూజించడంవల్ల ఆరోగ్యం దీర్ఘాయువు సంపద కలుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎంపీ జిల్లా గౌరవ అధ్యక్షులు బళ్ల వెంకటరమణ, మండల ప్రధాన కార్యదర్శి ఇరవాడ రవికుమార్, మండల కోశాధికారి వానపల్లి కనకరాజు,మండిపూడి చంద్రశేఖర్, పొన్నాడ శ్రీనివాస్,ఇందన వెంకటేశ్వరరావు,ఇరవాడ ఏడుకొండలు, శ్రీను, నరేష్, గాలింకి నాగేశ్వరరావు,సతీష్, శ్రీను,పియంపిలు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo