సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచిన శ్రీకృష్ణ ఫ్రెండ్స్ సర్కిల్…
మాజీ శాసనసభ్యులు డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి మనుమడు, వైస్సార్సీపీ మండపేట నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు చోడే శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.రాష్ట్ర కార్యదర్శి, కో ఆప్షన్ మెంబర్ రెడ్డి రాధాకృష్ణ ఆఫీస్ నందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మయూరి వృద్ధాశ్రమం, గవర్నమెంట్ ఆసుపత్రి నందు శ్రీకృష్ణ మిత్రుడు గాలీదేవర బాబీ ఆధ్వర్యంలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. తదుపరి ఆదర్శ హెల్పింగ్ హాండ్స్ సంస్థ నందు వృద్ధులకు వేమగిరి శేఖర్, దుగ్గిరాల రాంబాబు ఆధ్వర్యంలో అన్నదానం, దుప్పట్లు పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం లో సొసైటీ మాజీ అధ్యక్షులు పెంకే గంగాధర్,శివకోటి శేష సుబ్రహ్మణ్యం, వైస్సార్ సీపీ సీనియర్ నాయకులు పిఠాపురం సత్యనారాయణ, ముక్కా దాలయ్య, శెట్టి నాగేశ్వరావు,కొనాల సుభాష్ చంద్రబోస్, పులగం శ్రీను, మడికి ఆనందరావు, కోళ్ల శ్రీనివాస్,ఇసుకపల్లి అమర్నాథ్, తాతపూడి లక్ష్మీనారాయణ, వేమగిరి గాంధీ, బి.ఎస్.సుబ్రహ్మణ్యం, గంధం నంద, రాజబాబు & శ్రీకృష్ణ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

