వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మండపేట నియోజకవర్గ యువజన విభాగం కన్వీనర్ చోడే శ్రీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.యువజన విభాగం ద్వారా చేస్తున్న కార్యక్రమాలు గూర్చి ఏపీ సబార్బినేట్ కమిటీ చైర్మన్,ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వివరించగా జగన్ ప్రత్యేకంగా అభినందించారని శ్రీకృష్ణ ఆనందం వ్యక్తంచేశారు. యువజన విభాగం బలోపేతానికి కృషిచేయాలని సూచించారన్నారు. మాజీ ఎమ్మెల్యే బిక్కిన కృష్ణార్జున చౌదరి, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాజుబాబుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నట్టు శ్రీకృష్ణ తెలిపారు.