హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు
కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి తెలుగుదేశం డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొన్నారు.ఈ సందర్బంగా విచ్చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రుకి కిర్లంపూడి టౌన్ నాయకులు చదరం చంటిబాబు,గుడాల శ్రీలత రాంబాబు,తూము కుమార్,కుర్ల చినబాబు,కాళ్ళ వెంకటేష్,మద్దాల మణికంఠ స్వామి,ఆళ్ల శ్రీమన్నారాయణ తదితరుల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.ఇంటింటికీ తిరిగి ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ఎమ్మెల్యే నెహ్రూ పంపిణీ చేస్తూ ప్రజల నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు,యువనేత నారా లోకేష్ ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు,వీరంరెడ్డి కాశిబాబు, కంచుమర్తి రాఘవ,బొదిరెడ్ల సుబ్బారావు,బొడ్డేటి సుమన్,ఎడ్ల మురళీకృష్ణ,గండే రాయుడు, బేతాళ బాబ్జి తదితరులు పాల్గొన్నారు.