Monday, August 4, 2025
Monday, August 4, 2025

కాపు సామాజిక వర్గానికి కార్మిక మంత్రి సుభాష్ పెద్ద పీట 

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

కాపు సామాజిక వర్గానికి కార్మిక మంత్రి సుభాష్ పెద్ద పీట

విశ్వం వాయిస్ న్యూస్, రామచంద్రపురం

కాపు సామాజిక వర్గానికి కార్మిక మంత్రి సుభాష్ పెద్ద పీట

 

రామచంద్రపురం మార్కెట్ యాడ్ చైర్మన్ గా అక్కల రిశ్వంత్

 

ఆనందం వ్యక్తం చేసిన కాపు సంఘ నాయకులు

 

 

రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-25 సంవత్సరాలలో ఎప్పుడు లేని విధంగా రామచంద్రపురం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కాపులకి ఇవ్వడం చాలా అభినందించదగ్గ మరియు ఆనందదాయకమైన విషయం అని కాపు సామజిక వర్గం వారు పేర్కొన్నారు.అక్కల రిశ్వంత్ రాయ్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి వచ్చిన విషయం మనందరికీ విధితమే.అయితే రామచంద్రపురం కాపు కల్యాణ మండపంలో కాపులందరు సమావేశం అయ్యారు.ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ

కాపులకు ఈ పదవి రావటం చాలా మంచి పరిణామం అని,ఈ పదవి రావడానికి గల కారణం రిషి కి పార్టీ పట్ల నిబద్ధత కలిగి ఉండటమే కాకుండా ముఖ్యంగా కష్టపడ్డ వ్యక్తిని గుర్తించి ఈ పదవి రావడానికి మన మంత్రి సుభాష్ ప్రధాన పాత్ర అని అన్నారు.గత ఎన్నికలలో వాసంశెట్టి సుభాష్ కోసం ఎలక్షన్లో కష్టపడి పనిచేసి గెలుపుకు ప్రధాన కారణమైన కాపు కులం పట్ల ఉన్న ప్రేమను తెలియజేసారని ఆనందం వ్యక్తం చేశారు.

కాపులను ఎలక్షన్లో వాడుకుని వదిలేయకుండా వారి గెలుపు కోసం పాటుపడిన ప్రతి ఒక్కరిని గుర్తించి ఉన్నత స్థానాలకు తీసుకు వెళ్తున్న మన మంత్రి సుభాష్ రామచంద్రపురం పట్టణ కాపు సంఘం తరఫున కృతజ్ఞతలు

తెలియజేసారు.ఈ మేరకు పట్టణ కాపు సంక్షేమ సంఘం శుక్రవారం స్థానిక అరిగెల వీర్రాఘవులు కృష్ణ వేణి కాపు కళ్యాణ మండపము నందు సమావేశమై అక్కల రిష్వంత్ ను అభినందించడంతో పాటు మంత్రి సుభాష్ కు, జనసేన ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లకు ధన్యవాదములు తెలిపారు.కాపు సామాజిక వర్గానికి ఇంతగా ప్రాధాన్యత నిచ్చి రిష్వంత్ రాయ్ కి ఉన్నతమైన మార్కెట్ కమిటీ పదవి ఇవ్వడం పట్ల కాపు సామాజిక వర్గం పై ఆయనకున్న ప్రేమను అర్థం చేసుకోవచ్చని పలువురు కాపు నాయకులు తెలిపారు.ఈ సమావేశంలో కాపు సంఘం అధ్యక్షులు తొగరు బ్రహ్మాజీ,ఉపాధ్యాక్షులు మట్టా దుర్గారావు,కాపు పెద్దలు నారప రెడ్డి బలరామ్,పోలిశెట్టి శ్రీనివాసరావు,నాయుడు మాస్టారు తదితరులు మాట్లాడుతూ కాపులకు ఉన్నత స్థానమిచ్చిన మంత్రి సుభాష్ కి బుణపడిఉంటామని, ఎన్నటికీ ఆయిన వెంటే ఉంటామని వారంతా ముక్త కంఠంతో తెలిపారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo