20 October 2025
Monday, October 20, 2025

మాకెందుకులే అనుకుంటే మీకే ప్రమాదం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

చిన్న పాటి నిర్లక్ష్యం పెను ప్రమాదాన్ని సృష్టిస్తుంది.

ఇంటి వద్ద దీపావళి సామాగ్రి తయారీ చేసే ఆలోచన వద్దు

జనావాసాల్లో దీపావళి సామాగ్రి నిల్వ, అమ్మకాలను సహించేది లేదు.

ఎంతటి వారైనా నిస్సందేహంగా కేసులు నమోదు చేస్తాం…

ప్రమాదం జరిగాక పొందే ఆవేదన కంటే, ముందుగా మేల్కొనే జాగ్రత్త మేలు.

మండపేట రూరల్ సిఐ పి.దొరరాజు.

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం

దీపావళి పండుగ నిమిత్తం మందుగుండు సామాగ్రిని సొంతంగా తయారుచేసే ఆలోచన పెట్టుకోవద్దని ఈ విషయంలో చిన్న పాటి నిర్లక్ష్యాన్ని కూడా సహించబోమని  మండపేట రూరల్ సిఐ పి. దొర రాజు మంగళవారం ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్ళల్లో దీపావళి బాణాసంచా సామాగ్రి నిల్వ చేసినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, నిస్సందేహంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా మందుగుండు సామాగ్రి అక్రమ నిల్వలను గుర్తిస్తే, చుట్టుపక్కల వారు పోలీస్ వారికి సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. జనావాసాల మధ్య ఎవరైనా తమ స్వంతానికి మతాబులు, చిచ్చుబుడ్లు ఇతర దీపావళి సంబంధిత తయారీలు అవి చిన్న వైనా, పెద్దవైనా ఎటువంటి నిల్వలు ఉంచినా ప్రమాదమేనని పేర్కొన్నారు. మనకెందుకులే అనుకుంటే పక్కింట్లో ఉండే మీ ఇళ్లకే పెను ప్రమాదం ఏర్పడుతుందనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. జనావాసాల మధ్య చిన్న పాటి నిల్వలు ఉంచినా కేసులు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఏమైనా మందుగుండు సామగ్రి నిల్వలు గుర్తిస్తే వెంటనే సిఐ 9440796537, ఎస్సై 9440904843 లేదా 112 కు డయల్ చేసి సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను పూర్తి గోప్యంగా ఉంచుతామన్నారు.
ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన స్థలాల్లో తప్ప, మరెక్కడా రిటైల్ అమ్మకాలు సాగించకూడదని వ్యాపారులను హెచ్చరించారు. ప్రజలంతా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, కుటుంబంతో కలిసి దీపావళి పండుగను జరుపుకోవాలని సూచించారు. ప్రమాదం జరిగిన తర్వాత కంటే ముందుగా మేల్కోని జాగ్రత్త పడాలని మండపేట రూరల్ సిఐ పి. దొర రాజు, ఎస్సై సురేష్ బాబు లు తెలిపారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo