ఎక్సైజ్ దాడుల్లో నాటుసారాయితో వ్యక్తి అరెస్టు
కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం జరిపిన ఎక్సైజ్ దాడులలో ఒక వ్యక్తిని నాటు సారాయి అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం సామర్లకోట మున్సిపాలిటీ కుమ్మరి వీధి నందు గుబ్బల వీర ఆదివిష్ణు అనే వ్యక్తిని ఐదు లీటర్ల సారాయితో అరెస్టు చేశారు.సదరు వ్యక్తిని ఐదు లీటర్ల సారాయితో అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ కె రామ్మోహన్రావు తెలిపారు. ఈ దాడులలో ఎస్సై ఎం వి వి బి కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.