చిత్రలేఖనం ద్వారా విద్యార్థుల సందేశం
డ్రాయింగ్ మాస్టర్ సౌదాగర్ సూచనలు
దీపావళి శుభాకాంక్షలు తెలిపుతూ మండపేట ఎంపిఎస్ పాఠశాల విద్యార్థుల పటాకుల వాడకాన్ని తగ్గించి కుటుంబంతో కలిసి దీపాలు వెలిగించి శాంతియుతంగా పండుగని జరుపుకోవాలని సందేశాత్మక చిత్రాల ద్వారా తెలిపారు. రాబోయే తరాలకు కాలుష్యం కలిగించని దీపావళి గురించి పరిచయం చేయాలని, అలాంటి దీపావళి మొదట మనం ఆచరించి, తదుపరి తరాలకు తెలపాలని సందేశమిస్తూ మండపేట పబ్లిక్ స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ సౌదాగర్ తన విద్యార్థులతో దీపావళి సందర్భంగా వేయించిన చిత్ర లేఖనాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సౌదాగర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించని దీపావళి మన పూర్వీకులు ఆచరించారని, లక్ష్మీ పూజలు,పిండి వంటలు, దీపాల వరుసలతో ప్రతి ఇళ్ళు దేవాలయాలను తలపించేవని గుర్తు చేశారు,
దీపావళి కాలక్రమేణా ధ్వని కాలుష్యం,వాయు కాలుష్యం చేసేవిగా మారిపోయాయని ఈ విషయాలు విద్యార్థులతో చెప్పి, వారి చేత చిత్రలేఖనం చేయించినట్లు సౌదాగర్ తెలిపారు. కాగా విద్యార్థులు గీసిన చిత్రాలు ప్రదర్శిస్తూ, తమ ప్రతిభను చాటారు.
విద్యార్థులకు ఉత్తమ విషయాలపై అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న డ్రాయింగ్ మాస్టర్ సౌదాగర్, విద్యార్థులను పలువురు అభినంధించారు