22 October 2025
Wednesday, October 22, 2025

ప్రజల నడ్డి విరిచిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిది…

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

రాష్ట్ర ప్రజలంతా సూపర్ సిక్స్ అమలు పట్ల సంతృప్తి…

రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు మాదిగ…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట

కూటమి ప్రభుత్వం రాకముందు ఐదేళ్ల పాటు రాష్ట్రం లో పరిస్థితిలో ఎలా ఉన్నాయో, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఏడాది కాలంలో ఎటువంటి మార్పులు వచ్చాయో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని రాష్ట్ర మాదిగ వెల్ఫేర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు మాదిగ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పై వైసీపీ కౌన్సిలర్ మందపల్లి రవి కుమార్ చేసిన ఆరోపణలను ఆయన తిప్పి కొట్టారు. కూటమి ప్రభుత్వం ఎవ్వరికి పింఛన్లు తొలగించలేదని, మొత్తం 38,424 పింఛన్లకు గానూ కేవలం 335 మందికి మాత్రమే కేవలం అర్హత తెలియజేయమని నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. అయితే అవి కూడా ఎవ్వరికి తొలగించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తమ పార్టీ నేత సల్మాన్ ఒక సందేశాన్ని ప్రభుత్వానికి అందివ్వడం జరిగిందన్నారు. ఇందులో తప్పు పట్టాల్సిన విషయం ఏమి లేదన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు అనుక్షణం ప్రజల కోసమే ఆలోచన చేస్తారన్నారు. ఇకపోతే గతం లో ఇద్దరు కలసి ఒక రేషన్ కార్డులో ఉంటే వారిలో ఒకరికి రేషన్ తో పాటు పింఛన్లు సైతం తొలగించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. అర్హత ఉన్నా సరే పింఛన్లు తొలగించి పేద ప్రజల నడ్డి విరిచిన చరిత్ర వైసీపీ ప్రభుత్వానిదన్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే తిరుగులేని విధంగా దూసుకుపోతుంటే అది వైసీపీ నాయకులకు జీర్ణం కావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 11 సీట్లు అయినా వస్తాయా రావా అనే భయం ఆ పార్టీ నేతలకు పట్టుకుందన్నారు. ఆ భయం తోనే కూటమి ప్రభుత్వం పై లేని నిందలు మోపి వైసీపీ నేతలు విషం కక్కుతున్నారని మండిపడ్డారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రజలంతా సూపర్ సిక్స్ పథకాల అమలు పట్ల పూర్తి సంతృప్తికరంగా ఉన్నారన్నారు. వైసీపీ నేతలు చెప్పే తప్పుడు లెక్కలు నమ్మే పరిస్థితి ప్రజల వద్ద లేదన్నారు. గతిలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేశాకే ఓట్లు అడుగుతా అని ప్రగల్భాలు పలికి అది చేయకుండానే ఓట్లు అడిగిన విషయం మర్చిపోయారా అంటూ దొరబాబు విరుచుకుపడ్డారు. 45 ఇళ్ళు నిండిన ప్రతి మహిళకు పింఛను ఇస్తామని చెప్పారని ఆ హామీ ఏమైందో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. ఎంత మంది పిల్లలను బడికి పంపితే అంత మందికి 15 వేలు ఇస్తామని చెప్పారని అదీ జరగలేదన్నారు. వెయ్యి రూపాయలు ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తామని చెప్పారని అసలు ఆ హామీ మాటే పూర్తిగా విస్మరించారన్నారు. టిడ్కో రుణాల రద్దు, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా, గవర్నమెంట్ లో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ, ఏటా జనవరి ఒకటిన జాబ్ కేలండర్ విడుదల, మెగా డీఎస్సీ, అధికారం లోకి వచ్చిన వారం లో సీపీఎస్ రద్దు, ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం, సకాలంలో డి ఏ చెల్లిస్తాం, ప్రజలందరికీ 100 శాతం క్వాలిటీ తో కూడిన సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కరంటు ఛార్జీలు తగ్గిస్తాం, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం, ముస్లిం ల వివాహానికి లక్ష రూపాయలు కానుకగా ఇస్తాం అంటూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా హామీలే ఇచ్చి మాట తప్పిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదన్నారు. కౌన్సిలర్ రవి కుమార్ కు దమ్ముంటే ఈ పథకాల విషయం లో జగన్ మాట ఎందుకు తప్పాడో సమాధానం చెప్పాలనీ దొరబాబు డిమాండ్ చేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo