రాయవరం సబ్ స్టేషన్ పరిధిలో రాయవరం 11కెవి టౌన్ 2, మాచవరం ఫీడర్ల పరిధిలో మరమ్మత్తుల నిమిత్తం రాయవరం,మహేంద్రవాడ,మాచవరం గ్రామాలకు అక్టోబర్ 18 శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు శుక్రవారం తెలిపారు. దీనికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.