అధ్యక్షత వహించిన కమిటి చైర్మన్ తోట…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సచివాలయంలో సభార్డినేట్ లెజిస్లేషన్ కమిటి సమావేశం గౌరవ చైర్మన్ తోట త్రిమూర్తులు అధ్యక్షతన జరిగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును 12 మంది సభ్యులతో కూడిన శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే, బుధవారం ఉదయం తొలిసారిగా సమావేశమైన కమిటి లో 16 వ శాసనసభ 2వ, 3వ, 4వ సమావేశంలో సభ సమక్షంలో ఉంచిన గవర్నమెంట్ ఆర్డర్లు, రూల్స్ మరియు నోటిఫికేషన్స్ పై కూలంకుషంగా చర్చించారు తదుపరి సమావేశంలో శాఖలవారీగా సమీక్షలు జరుపుతామని తెలిపారు. ఈ మీటింగ్ లో కమిటి అసిస్టెంట్ సెక్రటరీ వేమూరి విశ్వనాథ్, సభార్డినేట్ లెజిస్లేషన్ కమిటి సభ్యులుగా ఉన్న శాసన సభ్యులు, సెక్షన్ అధికారి నరసింహ, కమిటి సచివాలయం అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

