రాష్ట్ర ఆర్ధిక ఇబ్బందులు అధిగమిస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ది అందిస్తున్నదని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండపేట మండలం, ఏడిద సీతానగరం, పాలతోడు, వెలతోడు, మెర్నిపాడు గ్రామాలలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రోడ్ల నిర్మాణం, అమరావతి, పోలవరం నిర్మాణం,సంక్షేమం, అభివృద్ది చేస్తున్నారని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన తెలిపారు. మున్ముందు మరిన్ని ప్రజలకు ఆమోదయోగ్యమైన సంక్షేమ పథకాలను అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

