వైసిపి ఆర్టిఐ యాక్ట్ నియోజకవర్గ కన్వీనర్ మందపల్లి రవి…
టీడీపీ నాయకులు సల్మాన్ హుస్సేన్ తన ద్వంద వైఖరి, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించకుండా ఉంటే మంచిదని వైసిపి ఆర్టిఐ యాక్ట్ నియోజకవర్గ కన్వీనర్ 8వ వార్డ్ కౌన్సిలర్ మందపల్లి రవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సల్మాన్ హుస్సేన్ మీడియా కి ఇచ్చిన స్టేట్మెంట్ లో వైసిపి మునిగిపోతుందని ఇచ్చారని కానీ నిజానికి మునిగిపోయేది వైసిపి పార్టీ కాదని కూటమి ప్రభుత్వమే అని అన్నారు. నిన్న గాక మొన్న మీరే సాక్ష్యాత్తు మీ నోటితోనే మీ పార్టీ వైఫల్యాలను దుయ్యబట్టారని అర్హులకు పింఛన్లు తీసేయడం మంచిది కాదని మీరే ఏడ్చి గగ్గోలు పెట్టారని దీన్ని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వాళ్ళు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా అని ఎద్దేవా చేశారు. ప్రజలు జ్ఞానులని వాళ్లకి అన్నీ తెలుసని మీ పార్టీ వైఫల్యాలను మీరే బయటపెట్టినందుకు మిమ్మల్ని మనసారా అభినందిస్తున్నాను అని అన్నారు. మీ పార్టీ అర్హులకు అన్యాయం చేస్తూ తూతూ మంత్రంగా పథకాలు అమలు చేస్తూ లేని గొప్పలు చెప్పుకుంటునారని ఒకప్పుడు షరతులు లేని పథకాలు అమలు చేస్తాం అని నేడు ప్రతి పథకంలోనూ ఏరివేత పెట్టీ తీవ్ర అన్యాయం చేస్తున్నారాని ఇందుకు మీ స్టేట్మెంట్ టే సాక్ష్యంగా పరిగణలోకి తీసుకొని మీ కూటమి నేతలు అందరూ సిగ్గు తెచ్చుకోవాలని, రాబోయే రోజుల్లో ప్రజలు వైయస్సార్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలను మోసం చేసి నట్టేట ముంచిందని ఏ పథకం కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరకూరగా అమలు చేసి గొప్పలు చెప్పుకోవడం సరికాదని అన్నారు.