– రిటైర్డు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవాదానం
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, భద్రాచలం:
యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం భద్రాద్రి యోగ ఆరోగ్య మిషన్ నరేష్ గురూజీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన భద్రాచలం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సురేష్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బూసిరెడ్డి శంకర్ రెడ్డి , యూనియన్ నాయకులు పులుసు ప్రసాద్ , ఏఐటీయూసీ నాయకులు కేవీ రావు , బ్రహ్మకుమారి మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు