అంగన్వాడీల న్యాయమైన కోరికలు నెరవేర్చాలి..
కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి
సిఐటియు.. డిమాండ్..
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
అంగన్వాడి కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడుతున్న రాజకీయ నాయకులపై చర్యలు చేపట్టాలని సిఐటియు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సిహెచ్ కృష్ణవేణి డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన రాయవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద మంగళవారం ఆల్ ఇండియా డిమాండ్స్ డే పురస్కరించుకుని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటి చెల్లించాలని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, అంగన్వాడీలకు రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచాలని, ఖాళీగా ఉన్న వర్కర్స్ హెల్పర్స్ పోస్టులను భర్తీ చేయాలని, అంగన్వాడీల న్యాయమైన కోరికలు నెరవేర్చాలని, అంగన్వాడీ కార్యకర్తలపై భౌతిక దాడులకు తెగబడుతున్న రాజకీయ నాయకులు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దాడులకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు చేపట్టకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి వెనుకాడబోమని హెచ్చరించారు. అనంతరం ఐ సి డి ఎస్ పి.ఓ .వరహా వెంకటలక్ష్మికి డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. అనంతరం భారి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి డి .ఆదిలక్ష్మి, మండల అధ్యక్షురాలు ఎస్. కృష్ణకుమారి, ప్రాజెక్టు పరిధిలో రామచంద్రపురం, రాయవరం, బిక్కవోలు, అనపర్తి మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ పాల్గొన్నారు.