వెదురుపాక గ్రామస్తులు పంచాయతీ దగ్గర ఆగ్రహం…
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
: కొన్ని రోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ వెదురుపాక గ్రామస్తులు గ్రామపంచాయతీ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. మండలం వెదురుపాక గ్రామంలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కాలనీ కి వెళ్ళే రోడ్ మరింత అద్వనంగా తయారైంది. కాలనీ వాసులు గ్రామ పంచాయతీ వద్ద వర్షం సైతం లెక్కచేయకుండా తమ గోడు వినండి మహాప్రభో అంటూ నినాదాలు చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.అధిక సంఖ్యలో కాలనీ వాసులు గ్రామ పంచాయతీ వద్దకు చేరుకుని నిరసన తెలియచేశారు.మా గోడు వినే నాథుడే లేడు అంటూ తమ గోడును మీడియా వాళ్ళకి తెలియచేశారు కనీసం సర్పంచ్ అందుబాటులో ఉండటం లేదు ఓట్ల కోసం మా దగ్గరకి రావడం తప్ప మా బాధలు నాయకులకు అవసరం లేకుండా పోతున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు ఎలా వున్నాయి. అంటే కనీసం బయటకు రాలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయిపోతే మా కాలనీకి రావడానికి రోడ్లు లేక కిరాణా షాపు కి వెళ్దాం అంటే రోడ్ల పై నడవలేని పరిస్థితి ఇప్పటికే 10 మంది బైక్ సైకిల్ మీద నుండి పడటం, చిన్న పిల్లలు సైతం స్కూల్ కి వెళ్లలేని పరిస్థితి. ఎవరకి చెప్పుకోవాలి.. గ్రామంలో నాయకులు వున్నారా. మీకు ఓట్లేకే మేము కావాలా.. మా ఆరోగ్యం మా బాధలు మీకు పట్టవా.. ఏమిటి ఇంకా మనం ఎక్కడ వున్నాం.. అని మహిళలు వాపోతున్నారు. కాలనీ ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తున్న కాలనీ లైట్లు, గాని రోడ్లు, గాని వాటర్, గాని లేకపోవడానికి కారణం ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్ టైం లో వచ్చి మీకు అది చేస్తాను, అని నాయకులు ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఎందుకు చేయడం లేదు అంటూ గ్రామ పంచాయతీ అధికారులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మహిళలు కాలనీ వాసులు పాల్గొన్నారు.