WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

104 సేవల క్రమబద్ధీకరణ అవసరం…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

104 సేవల క్రమబద్ధీకరణ అవసరం…
– ప్రజల వద్దకే వైద్య సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం…
– సమన్వయ లోపం కారణంగా సక్రమంగా అందని సేవలు…
– అత్యవసర పరిస్థితుల్లో కూడా సేవలు అందాలంటున్న గ్రామస్థులు…
– ప్రత్యేక పర్యవేక్షణా వ్యవస్థ అవసరం…

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

గ్రామాల్లో వయోభారం, అనారోగ్య సమస్యలతో మంచానికి పరిమితమైన వారికి, గర్భిణులు, మధుమేహం, రక్తపోటు, జ్వరం తదితర సమస్యలతో బాధపడుతున్న వారికి 104 సేవలను ప్రభుత్వం చేరువ చేసింది. అత్యవసర వైద్య సేవలకు ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో ఏకంగా మండలానికొక 104, 108 వాహనాన్ని 2020 జులై 1న అందుబాటులోకి తెచ్చారు. సేవలకు పునరుజ్జీవం పోసి నేటికి రెండేళ్లు పూర్తవుతోంది. మెరుగైన సేవలను అందించే నిమిత్తం ఈ 104 వాహన సర్వీసులను ఆయా సచివాలయాలతో ప్రభుత్వం అనుసంధానం చేసింది. తదనుగుణంగా వొ పి క్లీనిక్ లను సచివాలయ పరిధులలోనే నిర్వహించేవారు. తర్వాత ఇతర ప్రాంతాలలో వచ్చే వో పి కేసుల ఆధారంగా పై అధికారులు ఇచ్చిన రూట్ మ్యాప్ ప్రకారంగా తమ పరిధిలో మొబైల్ క్లీనిక్ లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో సమన్వయ లోపం కారణంగా 104 సేవలలో కొంత అంతరాయం ఏర్పడుతొంది. ఉదాహరణకు రాయవరం మండలం పరిధిలో 104 సర్వీసులు సక్రమంగా అందడం లేదని, అందువలన తప్పనిసరి పరిస్థితులలో ప్రైవెట్ డాక్టర్లను ఆశ్రయించాల్సివస్తొందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధుమేహం, అధిక రక్తపు పొటు, రక్తహీనత వంటి వ్యాధులకు రోగుల ప్రతీరోజు మందులు వేసుకోవలిసి వుంటుంది. వీరికి ప్రతీ గ్రామాన్ని నెలకొకసారి సందర్శించి, రోగులకు సాధారణ పరీక్షలు చెసి తదనుగుణంగా మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతొంది. అయితే ఒక గ్రామంలో క్లీనిక్ నిర్వహించే సమయంలో ఎంత అత్యవసర పరిస్థితులు వున్నా ఇంకొక గ్రామంలో వైద్య సేవలు అందుబాటులో వుండే అవకాశం లేదు. ఆ గ్రామ ప్రజలు అధికారులు ఇచ్చే రూట్ మ్యాప్ ఆధారంగా తర్వాతి రోజులలో క్యాంపు నిర్వహించేవరకు ఆగాల్సి వుంటుంది. ఇది రోగులకెంతో అసౌకర్యంగా వుంటుంది.https://viswamvoice.com/wp-content/uploads/gravity_forms/5-1c875ca9512b4c4ae02d5834cbf9c719/2022/07/WhatsApp-Image-2022-07-14-at-8.37.03-PM.jpeg

ఈ విషయమై విశ్వం వాయిస్ ప్రతినిధి సచివాలయం లో ఉన్న 104 సంచార ఆరోగ్య కేంద్రం సిబ్బంది ని కలిసి మురికి వాడలలో ఈ 104 ఆరోగ్య సేవను అందిస్తే ఉపయోగం ఉంటుంది కాని ,ఇలా ఒకచోట ఉండడం వలన ఫలితమేముంటుందని ,పైగా మీరు ఇక్కడ ఇదే ఊరిలో ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఉంది కదా ? మీ దాకా వచ్చేవారు అక్కడికి వెళ్లలేరా..? మీరు ప్రజల వద్దకు వెళ్లాలి కాని ఒక చోట వాహనం వదిలి మరొక చోట మీరు వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పడం ఎంత వరకూ సమంజసం అని వారిని అడగగా వారు చెప్పిన సమాదానమేమిటంటే వారికి ప్రభుత్వం నుండి ఈ విధంగా చేయమనే ఆర్డర్ వచ్చిందని ఇలానే చేస్తామని బయట చెట్ల క్రింద కూర్చుంటే పక్షులు రెట్టలు వేసేస్తున్నాయని చెప్పారు. ఒక వేళ మీ ప్రాంతంలో ఈ 104 వైద్యసేవలు అందించాలంటే దానికి అవసరమైన టెంట్, కరెంటు కుర్చీలు సమకూర్చి ఏర్పాటు చేస్తే వచ్చి వైద్యసేవలు అందిస్తామని వైద్యసిబ్బంది మరియు డాక్టర్ చెప్పారు. మురికి వాడలలో అందించాల్సిన వైద్యసేవలు వేరే సచివాలయం లో అందిస్తే ఏం లాభం ఉండదు కనుక బీదలైన వారికి వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలి..
మొత్తం మీదసీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్న ఈ సమయంలో ముందస్తు ప్రణాళికతో పాటు రోగుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతున్న గ్రామాలకు సత్వరమే వెళ్ళి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే విధంగా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణా విధానాన్ని రూపొందించాలి. గ్రామాలలో నమోదు అయ్యే రోగుల సంఖ్య ఎప్పటికప్పుడు గ్రామ సచివాలయాల నుండి యాప్ ల ద్వారా 104 సర్వీసు నియంత్రణా విభాగానికి అందే విధంగా వ్యవస్థ ఏర్పాటు చేయడం ఈ సమస్యకు ఒక పరిష్కారం.ఇందువలన సామాన్యులకు కూడా తక్షణ వైద్య సేవలు అందుబాటులోని రావడం తో పాటు ప్రజా క్షేమమే ప్రభుత్వ ధ్యేయం అన్న ప్రభుత్వ విధానం కుడా సఫలీకృతమౌతుంది.

రాయవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఎనస్థీషియా డాక్టర్ అందుబాటు ఉండాలి..
మండల కేంద్రమైన రాయవరం గ్రామం లో వున్న ఆరోగ్య కేంద్రం లో గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీ, లేదా సిజేరియన్ చేయడానికి అన్ని వసతులు వున్నప్పటికి, అందుకు అవసరమైన సర్జన్, ఎనస్థీషియా డాక్టర్ అందుబాటులో లేకపోవడం వలన ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సహాయం పొందలేకపోతున్నారు.

రాయవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రాయవరం, లొల్ల, వెదురుపాక, వి సావరం, మహేంద్రవాడ గ్రామాలలోని గర్భిణీ స్త్రీలు అత్యవసర పరిస్థితులలో వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తొంది. ఇదే అదనుగా ప్రైవెట్ క్లీనిక్ లు ఫీజులు, టెస్టులు, ఆపరేషన్ మరియు మందుల కోసం లక్షల్లో వసూలు చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు సదుపాయం వున్నా రొక్కం రూపం లో చెల్లిస్తేనే ఆసుపత్రులలో చేర్చుకుంటున్నారు. ఇక ఇంత డబ్బు ఖర్చు చేయలేని పేదవారు దూరంలో వున్న రామచంద్రాపురం లేదా అనపర్తికి వెళ్ళాల్సి వస్తొంది. ఇక్కడికి చేరుకోవడం కూడా పెద్ద ప్రయాస గా వుంటోంది. అంటువ్యాధులు ప్రభలేది ఎక్కువగా వర్షాకాలం లోనే కదా … 104 సర్విస్ దలిత వాడలో ఒకసారి ,వెలమపేటలో ఒకసారి, జంగాల పేటలో, దేవాంగపేటలో ఇలా మార్చి చేయాలి గవర్నమెంట్ హాస్పటల్ లో డెలివరీ లు, సర్జరీ లు కూడా జరగాలి.

దువ్వ చంద్ర శేఖర్, మదర్ థెరిస్సా ట్రస్ట్, రాయవరం

అన్ని గ్రామాలకు 104 ద్వారా మేము వైద్య సేవలు అందిస్తున్నాం…

మేము ప్రతీ నెల ఒక గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము. రాయవరం 1 క్లస్తర్ పరిధిలో వున్న అన్ని గ్రామాలకు 104 ద్వారా మేము వైద్య సేవలు అందిస్తున్నాం. సచివాలయం ఆవరణలో సాధారణం గా క్యాంపు నిర్వహించడం జరుగుతుంది.ఇతర ప్రాంతాలలో కమ్యూనిటీ హలు లేదా గుళ్లలో క్యాంపులను నిర్వహిస్తాం. ఈ క్యాంపులు ఎన్ సి డి పద్ధతిలో జరుగుతుంది.
ఈ క్యాంపులలో అధిక రక్తపు పోటు, మధుమేహం వున్నవారికి అవసరమైన నిర్ధారిత పరీక్షలు చేసి మందులు అందిస్తున్నాం.అయితే నూతన ప్రభుత్వ విధానం వలన దగ్గు, జ్వరం, డయేరియా వంటి సీజనల్ వ్యాధులకు కుదా చికిత్స అందిస్తున్నాం.అయితే ముందస్తుగా నిర్ణయించిన రూట్ మ్యాప్ బట్టి ఆయా రోజులలో నిర్ధారిత ప్రాంతాలకు మాత్రమే వెళ్ళగలం. ఎందుకంటే ఈ ఎన్ సి డి క్లీనిక్ లలో ఎక్కువగా వచ్చే బి,డయబెటీస్ రోగులకు క్రమం తప్పకుండా మందులు ఇవ్వాల్సి వుంటుంది. క్యాంపుల షెడ్యూల్ మార్చితే రోగులకు రెగ్యులర్ గా మందుల సరఫరా జరగడం సాధ్యం కాదు.మా మెడికల్ క్యాంపు వివరాలు అందరికీ తెలిసేందుకు ఆశా కార్యకర్తల ద్వారా ఇంటింటికీ ప్రచారం చేయిస్తున్నాం. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ వొపి డి క్లీనిక్ నిర్వహిస్తున్నాం. మధ్యాహం 2 నుండి 430 గంటల మధ్య మంచం పట్టి కదలలేని స్థితిలో వున్న రోగులకు వారి ఇంటి వద్దనే వైద్యసేవలు అందిస్తున్నాం.
డా: బి వి వి దుర్గా భవాని

అధికారులు ఇచ్చిన రూట్ మ్యాప్ ఆధారంగా ప్రతీ నెలలో ప్రతీ గ్రామానికి వెళ్ళి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వుంటాము…

మాకు పై అధికారులు ఇచ్చిన రూట్ మ్యాప్ ఆధారంగా ప్రతీ నెలలో ప్రతీ గ్రామానికి వెళ్ళి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వుంటాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదట్లో వొ పి క్లీనిక్ లను సచివాలయ పరిధులలోనే నిర్వహించేవాళ్ళం. .తర్వాత ఇతర ప్రాంతాలలో వచ్చే వో పి కేసుల ఆధారంగా తమ పరిధిలో మొబైల్ క్లీనిక్ లను ఏర్పాటు చేస్తున్నాం. రాయవరం – 2 క్లస్టర్ లో 104 క్లీనిక్ లను ప్రతీ వారం సచివాలయం వద్ద నిర్వహిస్తున్నాo. ఈ ప్రాంతం జనబాహుళ్యానికి దూరంగా వుండడ వలన రోగులు అక్కడికి చేరుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. తత్ఫలితంగా క్యాంపుకు వచ్చే రోగుల సంఖ్య తగ్గి, 104 సేవలు ఆశించిన స్థాయిలో లభ్యమవడం లేదన్నది కొంతవరకు వాస్తవమే. కాబట్టి ఈ విషయంలో మండల మరియు జిల్లా అధికారులు స్పందించి క్లీనిక్ ల ఏర్పాటుకు గ్రామంలో అందరికీ సులభంగా అందుబాటులో వుండే ప్రాంతంలో సౌకర్యం కల్పిస్తే రోగులకు మరింత ఉపయుక్తంగా వుండి సమస్య పరిష్కారమౌతుంది. ప్రజల క్షేమమే మా క్షేమంగా భావించే మేము 104 సర్వీసులు అందరికీ సక్రమంగా అందాలన్న లక్ష్యంతో అహర్నిశలు కృషి చేస్తున్నాం.

డి ఈ వో శ్రీనివాస్…

 

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement