విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన అధికారులు. రాయవరం మండలంలోని పసలపూడి గ్రామ సచివాలయం2 పరిధిలోని నరాలవారిపాలెం లో పారిశుధ్య లోపంతో డెంగ్యూ వ్యాధులు ప్రబలి, పలువురు జ్వరాలు బారిని పడ్డారని, వారు వివిధ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, ఈ సంఘటన సంబంధిత అధికారులకు ఎవరికీ తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటన చూసిన అనంతరం మాచవరం పిహెచ్ సి వైద్యాధికారి ఎం. శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది హుటాహుటీన నరాలవారిపాలెం లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇంటింటా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో ఒకే కుటుంబంలో ఆరుగురికి సాధారణ జ్వరాలు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. ఇందులో 7గురు జ్వరాలతో ఉన్నారని, 5 గురు వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారని,ఇద్దరు స్థానికంగా ఉండి వైద్యం తీసుకుంటున్నట్లు తెలియజేశారు.
ప్రస్తుతం గ్రామంలో అందరూ ఆరోగ్యoగా ఉన్నట్లు తెలియజేశారు. గ్రామం అంతా పంచాయతీ సిబ్బందితో శానిటేషన్ చేయించడం జరిగిందని,అబాట్ దోమల మందు పిచికారి చేయించడమైనది.మురిగి నీటి నిల్వలు లేకుండా చూడ్డ మైనది అదేవిధంగా సాయంకాలం సమయంలో ఫాగింగ్ చేయించవలసిందిగా పంచాయతీ కార్యదర్శి సానిటరీ సిబ్బందికి మండల ఎంపీడీవో డి శ్రీనివాస్ ఆదేశించారు. అనంతరం గ్రామంలో ఎంపీడీవో డి శ్రీనివాస్ తో పాటు డిఎల్పిఓ ఎం రామకృష్ణారెడ్డి, మాచవరం పిహెచ్సి వైద్య అధికారి ఎం శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ కడలి పద్మావతి, వైద్య సిబ్బంది ప్రతి వీధిలో పారిశుధ్య పనులు పర్యవేక్షించి ఇంటింటికి వెళ్లి వివరములను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కడలి పద్మావతి మాట్లాడుతూ గ్రామంలో క్రమం తప్పకుండా పారిశుధ్యం పనులు చేపసుతున్నామని ప్రస్తుతం గ్రామంలో డెంగ్యూ లక్షణాలు గల పేషంట్లెవరు లేరన్నారు. డెంగ్యూ జ్వరంతో గ్రామస్తులు బాధపడుతున్నారన్న వార్త అవాస్తవమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి మల్లిడి నారాయణరెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.