విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
దేశంలోనే సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కే దక్కుతుందని సోషల్ బిహేవియర్ చేంజ్ కమ్యునికేషన్, విలేజ్ సేకటేరియట్ విలేజ్ వార్డు సేకటేరియట్, డిస్ట్రిక్ట్ కొర్డినేటర్ బి.అనంతలక్ష్మి అన్నారు. మండల కేంద్రమైన రాయవరం శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు బుదవారం డిస్టిక్ కో ఆర్డినేటర్ అనంతలక్ష్మి విద్యార్థిని విద్యార్థుల కు ప్రతిరోజు జరిగే మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి భోజన పథకం యొక్క నాణ్యతను, రుచిని విద్యార్థిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.ప్రధానోపాధ్యాయులు పప్పు శ్రీనివాస్ రెడ్డి అధ్వర్యంలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డిస్టిక్ కో ఆర్డినేటర్ అనంతలక్ష్మి పాల్గొని విద్యార్థిని విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా ప్రోత్సహకాలను ముఖ్యంగా జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి పథకం, మొదలగు విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే అనేక కార్యక్రమాల గురించి వివరించారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థ వారి యొక్క విధి విధానాలు తెలియజేస్తూ దేశంలోనే సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని తెలియజేశారు. పాఠశాల యొక్క పనితీరును, విద్యార్థిని విద్యార్థుల యొక్క క్రమశిక్షణ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్టాప్ సెక్రెటరీ పడాల సత్యనారాయణ రెడ్డి , రాయవరం-1 వెల్ఫేర్ అసిస్టెంట్ ఎస్. రవి , మహిళా పోలీస్ లు యు లక్ష్మి సురేఖ, కే.సత్యవేణి, రాయవరం-2 వెల్ఫేర్ అసిస్టెంట్ డి.నరేష్ వర్మ పాల్గొన్నారు.