విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
: ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి నెల శుక్రవారం 104 వాహనం ద్వారా గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ ఛంద్రమళ్ళ రామకృష్ణ సూచించారు. మండల కేంద్రమైన దళితవాడలో పిహెచ్సి వైద్యాధికారిణి అంగర దేవి శ్రీ రాజశ్రీ ఆధ్వర్యంలో
గ్రామంలోని సచివాలయం వద్ద శుక్రవారం కమ్యూనిటీ హాల్ వద్ద 104 వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామకృష్ణ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామంలో అప్రమత్తంగా ఉండాలని, గ్రామంలో ప్రతి శుక్రవారం గ్రామ సచివాలయాల వద్ద ఏర్పాటుచేసిన 104 వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో వైద్యాధికారిని అంగర దేవి రాజశ్రీ పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరం ద్వారా హిమో గ్లోబిన్, షుగర్, ఈసీజి, టీబీ, ఆస్తమా, థైరాయిడ్ పరీక్షలు చేస్తామన్నారు. అనంతరం ఉచితంగా మందులు అందిస్తామన్నారు. అనంతరం పిహెచ్సి సిబ్బంది వైద్యాధికారిణి దేవి రాజశ్రీ
మధ్యాహ్నం నడవలేని రోగుల వద్దకు వెళ్లి ఆమె వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ జె శంకర్, హెల్త్ అసిస్టెంట్ తాతపూడి ఇమ్మానుయేలు, ఏఎన్ఎం ఎం బుజ్జి, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.