విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
:శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి షష్ఠి వేడుకలు భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు, అభిషేకాలు ఘనంగా చేశారు. ఆలయ వేద పండితులు స్వామి వారికి హోమాలు చేపట్టారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా మండలం సోమేశ్వరం గ్రామంలో మంగళవారం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ బాలాత్రిపురసుందరి సమేత సోమేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీ వల్లి దేవసేన సమేత సంతాన సాఫల్య సుభ్రమణ్యేశ్వర స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా షష్టి ఉత్సవాలకు సిద్ధమైంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు.
సోమేశ్వరం, పసలపూడి దేవాలయాలలో భక్తుల తాకిడితో రద్దీగా మారింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి రోజున స్వామివారిని దర్శించుకుంటే సర్వాభిష్టాలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన అరటి పండ్లను నైవేద్యంగా పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో స్వామివారికి దీపారాధనలు చేశారు. ఆలయం ప్రాంగణంలో పుట్ట వద్ద భక్తులు పాలు, గుడ్లు వేసి పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకునేలా.. దేవస్థానం పాలక వర్గం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది, ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పరిటాల సుబ్రమణ్యేశ్వర శర్మ , సోమేశ్వర శర్మ లు మాట్లాడుతూ సోమేశ్వరంలో చంద్ర ప్రతిష్టిత పురాణ ప్రాశస్త్యం గల శ్రీబాలాత్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వేయించేసియున్న శ్రీవల్లి దేవసేన సమేత సంతాన సాఫల్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని అర్చించిన వారికి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందన్నారు .సర్వదోషాలు, సకల పాపాలు హరిస్తాయన్నారు. మండలంలో శైవక్షేత్రాల్లో వేంచేసియున్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఘనంగా షష్టి మహోత్సవాన్ని నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూలు పడగలు సమర్పించారు.
అర్చకులు పరిటాల సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో పరిటాల సోమశేఖర శర్మ తదితర పండితులు వేకువజాము నుండి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ వేడుకలో రాయవరం ఎం పి డి వి డి. శ్రీనివాస్, ఈ వో పి ఆర్డి ఏ గోవింద్ రాజులు, సోమేశ్వరం గ్రామ సర్పంచ్ షేక్ ఆరిఫ్ తదితరలు పాల్గొన్నారు.