– వైరస్ ను తిప్పుకొట్టే ఏ టీ ఆర్ మందులు అందుబాటులో వచ్చాయి…
-పి.హెచ్ సి వైద్యాధికారిణి అంగర దేవి రాజశ్రీ…
విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
ఎయిడ్స్ అంటే నేడు భయపడే పరిస్థితి లేదని నివారణ మార్గాలపై అవగాహన పెంచుటతో పాటు వైరస్ ను సమగ్రంగా తిప్పుకొట్టే ఏ టీ ఆర్ మందులు మందులు అందుబాటులో లోనికి రావడంతో వ్యాధి ఉధృతి బాగా తగ్గిందని పిహెచ్ సి వైద్యాధికారిణి అంగర దేవి రాజేశ్వరి పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద గురువారం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దేవి రాజశ్రీ అధ్యక్షతన ప్రపంచ ఎయిడ్స్ డే సందర్భంగా అవగాహన, ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మెడికల్ ఆఫీసర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎయిడ్స్ అంటే నేడు భయపడే పరిస్థితి లేదని నివారణ మార్గాలపై అవగాహన పెంచుటతో పాటు వైరస్ ను సమగ్రంగా తిప్పుకొట్టే ఏ టీ ఆర్ (యాంటీ రిట్రో వైరల్ డ్రగ్ )మందులు అందుబాటులో లోనికి రావడంతో వ్యాధి ఉధృతి బాగా తగ్గిందని తెలియజేసినారు. ముఖ్యంగా సెక్స్ వర్కర్లు స్వలింగ సంపర్కులు సూదులతో మారకద్రవ్యాలు తీసుకునేవారు, లింగమార్పిడి చేయించుకున్న వారి అయినటువంటి ఈ కీ పాపులేషన్ ద్వారా వీరితో సంబంధాలు కలిగి ఉన్న వారికి ఈ వ్యాధి సంక్రమణ జరుగుతుంది, తద్వారా వారి కుటుంబ సభ్యులకు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలియజేసినారు. ఈ వ్యాధిపై అవగాహన కొరకు వైద్య ఆరోగ్య సిబ్బంది వివిధ వాలంటరీ ఆర్గనైజేషన్ విస్తృతంగా నివారణ మార్గాలను ప్రచారం చేయుచున్నాయని, ఎయిడ్స్ పరీక్ష చేయించుకుందాము అనే అనుకునే వారందరికీ కూడా అన్ని వైద్య ఆరోగ్య కేంద్రాలలోనూ ఉచితంగా ఈ పరీక్షను నిర్వహించటం జరుగుతుందని, అదేవిధంగా ప్రతి గర్భిణీ స్త్రీలు కూడా మనం ఆరోగ్య పరీక్షలో ఈ పరీక్ష చేయడం జరుగుతుందని, ఎయిడ్స్ వ్యాధిన పడిన వారందరికీ కూడా ఏఆర్టి చికిత్స ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ఎయిడ్స్ అనుమానితులు గాని ఎయిడ్స్ పై ఏమైనా సమాచారం కావాల్సిన యెడల మీ పరిధిలోని మెడికల్ ఆఫీసర్ ని ఏ సందర్భంలో అయినా వచ్చి కలిసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చుని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేషన్ డి కృష్ణ శేఖర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వాణికుమారి, హెల్త్ విజిటర్ విజయలక్ష్మి, ఏఎన్ఎం బుజ్జి, ఆశాలు వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.