విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
స్థానిక వనరుల లభ్యత మేరకు ప్రజల భాగస్వామ్యంతో వాస్తవిక ,ప్రణాళికలు రూపొందించడమే జిపిడిపి విధానం మని జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోమంగళవారం ప్రజా ప్రణాళిక ప్రచారం 2022 జి పి డి పి 2023 2024 మండల స్థాయి శిక్షణ కార్యక్రమం 6/12/2022 నుండీ 08/12/2022 వరకు మూడు రోజులు శిక్షణ తరగతులు నిర్వహణలో భాగంగా మొదటిరోజు శిక్షణ కార్యక్రమాన్ని మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ అధ్యక్షతన స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి హాజరయ్యారు. మొదటిరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని చెల్లూరు, కురకాళ్లపల్లి, లొల్ల, కూర్మాపురం గ్రామ పంచాయతీల పరిపాలన సిబ్బందికి శిక్షణ కార్యక్రమమునకు గ్రామ సర్పంచులు , మండల ప్రాదేశిక సభ్యులు పంచాయితీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బంది మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులలో ఎంపీడీవో డి శ్రీనివాస్ మరియు ఆయా శాఖల ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ స్థానిక అవసరాల ఆధారితంగా, స్థానిక వనరుల లభ్యత మేరకు ప్రజల భాగస్వామ్యంతో వాస్తవిక ,ప్రణాళికలు రూపొందించడమే జిపిడిపి విధానం. ప్రణాళిక రూపకల్పన నుండి పనుల అమలు. పర్యవేక్షణ మరియు సామాజిక తనిఖీ మొదలైన
అంశాలతో కూడిన సమగ్ర విధానమే జిపిడిపి. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం ద్వారా పొందగలిగే అన్ని సౌకర్యాలను అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అందజేయడం.రాజ్యాంగ స్ఫూర్తితో లభ్యమయ్యే వనరులన్నిటిని ప్రజలకు అందుబాటులోకి తేవటం, అందరికీ సమాన అవకాశాలు కల్పించటం, చక్కటి సుపరిపాలన స్థానిక ప్రభుత్వాల ద్వారా అందించడం జిపిడిపి విధి.పలు అంశాలపై సంబంధిత శాఖల ప్రణాళికలను అనుసంధానిస్తూ ప్రాధాన్యత రంగాలైన వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు, విద్య, ఆరోగ్యం, మహిళా అభివృద్ధి, పౌష్టికాహారం, నైపుణ్య అభివృద్ధి, పరిశుభ్రత మొదలైన ప్రణాళికలను సమగ్రంగా జిపిడిపిలో పొందుపరుస్తారు. ఈ ప్రణాళికలో సంబంధిత శాఖల అధికారులు, వనరులు, ఏకీకృతమై స్థానిక ప్రభుత్వ పరిధిలో సమగ్ర అభివృద్ధికై పనిచేస్తాయి తెలియజేశారు.