విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
ఓ మైనర్ బాలికపై అత్యాచార యత్నానికి ప్రయత్నించిన ఘటనపై తల్లి ఇచ్చిన పిర్యాదు మేరకు రాయవరం ఎస్సై పి వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ గురువారం స్థానిక విలేకరలు తెలియజేశారు. ఎస్సై కథనం ప్రకారం మండల కేంద్రమైన రాయవరంలో 17సంవత్సరాల యువకుడు బుధవారం సాయంత్రం సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బయట ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలికను లోపలికి తీసుకెళ్లి అత్యాచార యత్నానికి ప్రయత్నించినట్టు బాలిక తల్లిదండ్రులు స్థానిక రాయవరం పోలీస్ స్టేషన్లు ఫిర్యాదు చేశారు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు పట్టుకుని యువకుడికి దేహశుద్ధి చేసే తరుణంలో తప్పించుకుని పారిపోయాడు. జరిగిన ఘటనను ఆ బాలిక తన తల్లిదండ్రులకు వివరించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఫోక్షో చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడు గురించి గాలింపు చర్యలు చేపట్టారు. బాలికను మండపేట హాస్పటల్ కి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. భారతీయ శిక్షాస్మృతి, ఫోక్షో చట్టం ప్రకారం ఆ యువకుడిని అరెస్టు చేసి తగు చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్సై సురేష్ విలేకరులకు తెలిపారు.