విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
మండల కేంద్రమైన రాయవరం గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ కి ఈ నెల 22 శనివారం తూల్యభాగం నది తీరాన రహదారి మరమ్మతులు చేయిస్తుండగా ఎడమ కాలికి గాయం తగిలింది. సర్పంచికి వైద్యుల సూచన మేరకు ఎడమ కాలికి కట్టు వేశారు. విషయం తెలుసుకున్న మండపేట వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్, రాష్ట్ర శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు మంగళవారం సర్పంచును పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య చికిత్సలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాయవరం ఎంపీపీ నౌడు వెంకటరమణ, జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకట్ రెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ తేతల సుబ్బరామిరెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు సిరిపురపు శ్రీనివాస్, రాయవరం ఎంపీటీసీ గంటి రోజా , గ్రామ ఉపసర్పంచ్ బొడ్డు శ్రీను, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పలువురు ప్రజాప్రతినిధులు ప్రముఖులు అధికారులు పాల్గొన్నారు.