విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
దొరల ప్రభుత్వం కాదు పేదల ప్రభుత్వంమని మండపేట వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మండలంలో సోమేశ్వరం గ్రామంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు, సర్పంచ్ షేక్ ఆరిఫ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముఖ్యాదితులుగా పాల్గొని మాట్లాడుతూ గ్రామాల్లో రహదారులు, డ్రెయినేజీల నిర్మాణాలకే పెద్దపీట వేస్తున్నామన్నారు. సోమేశ్వరం గ్రామంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులను పూర్తి చెయ్యడం జరిగింది అని తోట తెలియజేశారు. ఎన్నికలు నాడే రాజకీయాలుఅని, ఎన్నికలు అనంతరం రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి సమిష్టిగా కృషి చెయ్యాలని తోట కోరారు. సర్పంచ్ ఆరిఫ్ కు గ్రామస్తులు అందరూ అభివృద్ధిలో సహకరించడం అభినందనీయం అన్నారు. తొలుతగా రూ.2.68 కోట్లతో నిర్మించనున్న విద్యుత్తు ఉపకేంద్రానికి ఎమ్మెల్సీ భూమి పూజ చేశారు. 14, 15 ఆర్ధిక సంఘ నిధులలో రూ.3లక్షలతో నిర్మించిన సోమగుండం దక్షిణంపైపు రక్షణగోడ, రూ.11 లక్షలతో నిర్మించిన చెరువులోని కాలిబాట వంతెన, రూ.15 లక్షల జడ్పీ నిధులతో నిర్మించిన రుద్రభూమి సీసీ రహదారి, స్నానఘటాలను ఎమ్మెల్సీ ప్రారంభించారు. ముందుగా సోమేశ్వరస్వామి ఆలయాన్ని ఎమ్మెల్సీ తోట సందర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ నౌడు వెంకటరమణ, జడ్పీటీసీ నల్లమిల్లి మంగతాయారు, ఎంపీటీసీ అప్పారావు, ఉపసర్పంచ్ శాకా ఆదినారాయణ, ఈపీడీపీ ఈసీఎల్ ఎస్ఈ టీవీఎస్ఎన్ మూర్తి, రామచంద్రపురం డీఈఈ దాట్ల శ్రీధర్ వర్మ, ఏడీఎ పి.సన్యాసిరావు, రాజమహేంద్రవరం ఈఈ(కనస్ట్రక్షన్స్) వై. డేవిడ్, డీవైఈఈ టీవీ శివరామకృష్ణ, రాయవరం సబ్ ఇంజనీర్ ఈశ్వరరావు, ఎంపీడీవో డి. శ్రీనివాస్, హౌసింగ్ ఎఈ కే శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎం పి టిసి లు, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది, విధ్యుత్ శాఖ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, వెలుగు సిబ్బంది, అంగన్ వాడి కార్యకర్తలు, వెలుగు సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.