విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
మండలం గృహ సారధులు, కన్వీనర్లు సమన్వయంతో పని చేస్తూ ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నెరవేర్చాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. మండలంలోని సోమవారం చెల్లూరు గ్రామంలో పసలపూడి, మాచవరం, చెల్లూరు, వెంటూరు ,కురకాళ్లపల్లి, కుర్మాపురం గ్రామాల సచివాలయ కన్వీనర్లు గృహసారధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ తోట ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కన్వీనర్లు గృహసారథిలపై ముఖ్యమంత్రి అపారమైన నమ్మకంతో గురుతర బాధ్యతను అప్పగించారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా చిత్తశుద్ధితో మీరంతా పనిచేయాలన్నారు. వాలంటీర్లు ,గృహ సారథులు, కన్వీనర్లు, స్థానిక నేతలు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా 2024 లో జరిగే ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేయాలన్నారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ పాలికి రాఘవ గోవిందు, జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకట రెడ్డి, ఎంపీపీ నౌడు వెంకటరమణ , రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి కొవ్వూరి త్రినాథ రెడ్డి, సిరిపురపు శ్రీనివాసరావు తదితరులు ముఖ్యమంత్రి పాలనను వివరిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంటూరు సర్పంచ్ వాసంశెట్టి వెంకట్రావు, సర్పంచ్ కడలి పద్మావతి, మాచవరం సర్పంచ్ కత్తుల సీతామహాలక్ష్మి అప్పారావు, కూర్మాపురం సర్పంచ్ చౌటుపల్లి చక్రవేణి వెంకట్రావు, కొరకాళ్లపల్లి సర్పంచ్ పెళ్లి శారదా ప్రసాద్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.