విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
: గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం సంపూర్ణంగా అభివృద్ధిని సాధిస్తున్నారని జెడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు, ఎంపీపీ నౌడు వెంకటరమణ పేర్కొన్నారు. సోమవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని మండల పరిషత్తు సమావేశపు హాల్లో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో డి. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి, ఎంపీపీ నౌడు రమణ లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం సంపూర్ణంగా అభివృద్ధిని సాధిస్తుందన్నారు. గ్రామాల్లో సంపూర్ణ పారిశుధ్యం, త్రాగునీరు ,సరఫరా తదితర మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, స్థానిక సంస్థలు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తహసీల్దార్ కేజే ప్రకాష్ బాబు మాట్లాడుతూ గ్రామపంచాయతీలు ద్వారా ప్రజలకు అత్యంత చేరవుగా అందుతున్న పాలనను వివరిస్తూ తెలియజేశారు. అనంతరం వివిధ రంగాల్లో గ్రామాల అభివృద్ధికి కృషిచేసి అవార్డులు అందుకున్న సర్పంచులకు అభినందనలు తెలిపారు. అనంతరం చెల్లూరు సర్పంచ్ పాలికి రాఘవ, రాయవరం సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ, సోమేశ్వరం సర్పంచ్ ఆరిఫ్, పసలపూడి సర్పంచ్ కడలి పద్మావతి, కూర్మాపురం సర్పంచ్ చౌటుపల్లి చక్రవేణి , కురకాళ్లపల్లి సర్పంచ్ పిల్లి శారదా, వెంటూరు సర్పంచ్ వాసంశెట్టి వెంకట్రావు, మాచవరం సర్పంచ్ కత్తుల సీతామహాలక్ష్మి, నదురుబాద సర్పంచ్ చింతపల్లి శ్రీనివాసరావు లను ఘనంగా సత్కరించారు. తొలుతగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డిఇ కె.రామ నారాయణ, ఈవోపీఆర్డి అత్తిలి గోవిందరాజులు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీవో జే. సుధారాణి, పంచాయతీ కార్యదర్శులు సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.