Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

గ్రామా అంతరాలు వెళ్లే వారు ఎల్ హెచ్ ఎం ఎస్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలి..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరం..
సెలవల్లో తల్లిదండ్రులు చిన్నారుల కదలికను కనిపెట్టి చూడాలి..
జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను పూర్తి అవగాహన చేసుకొనేందుకు తనిఖీలు..
రాయవరం పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ…

విశ్వంవాయిస్ న్యూస్, :

పోలీస్ స్టేషన్ లకు వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతయుతంగా వ్యవహరించి, సమస్య తక్షణ పరిష్కారానికి కృషి చేయాలని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ పోలీసులకు సూచించారు. రాయవరం పోలీస్ స్టేషన్ ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా అయన స్థానిక విలేకర్లుతో మాట్లడుతూ వేసవి కాలంలో దోపిడీలు, దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున గ్రామా అంతరాలు వెళ్లే వారు ఎవరైనా స్థానిక మహిళా పోలీస్ కు, పోలీస్ స్టేషన్లలో తెలియపరచి ఎల్ హెచ్ ఎం ఎస్(లాక్కుడ్ హౌస్ మోనటరింగ్ సిస్టం)ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సెలవల్లో ఈత సరదాతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటి నివారణకు తల్లిదండ్రులు చిన్నారుల కదలికను కనిపెట్టి చూడాల్సిన అవసరముందన్నారు. కాలువలు, నదులు వద్ద జనం రద్దీ ఉన్న ప్రదేశాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం మైనర్లకు వాహనాడు ఇవ్వడం వల్లనే జరుగుతున్నాయని, తమ చిన్నారులకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. చట్ట ప్రకారము తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. మొదటగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న వివిధ కేసులకు సంబంధించిన వాహనాలను పరిశీలించి, పోలీస్ స్టేషన్ లోని పరిశుభ్రతను, రికార్డులను భద్రపరిచే విధానాన్ని, స్టేషన్ రిసెప్షన్ లో ఫిర్యాదుదారుల పట్ల వ్యవహరించే విధానాన్ని రిసెప్షన్నిస్టు అడిగితెలుసుకున్నారు. తదుపరి పోలీస్ స్టేషన్ ఆవరణను తిరిగి పరిశుభ్రతలపై తగు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి ఏ సమయంలోనైనా ఆకస్మిక తనిఖీలు చేపడతానని తెలియజేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితుల పట్ల మర్యాదగా వివరించాలని, సమస్యను పరిష్కరించే వరకు ఫిర్యాదుదారులకు జవాబుదారీగా ఉండాలని తెలిపారు. దర్యాప్తు చేస్తున్న వివరాలు ఎప్పటికప్పుడు బాధితులకు వివరించాలని, ఎల్లవేళలా ఒకే విధమైన సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధుల్లో సమయపాలన పాటించాలని, న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించే విధంగా దర్యాప్తును పూర్తి చేసే చర్యలు తీసుకోవాలన్నరు. ప్రజల మద్యే ఉంటూ పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న పోలీసుల పాత్రే కీలకంగా ఉంటుందని తెలిపారు. కాబట్టి సిబ్బంది పోలీసు స్టేషన్ లోని ప్రతి గ్రామం గురించి అవగాహాన కల్గివుండాలని, ప్రజలతో మమేకమై ప్రజలకు మరింత చేరువ కావాలని, అదే విధంగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలని సూచించారు. గ్రామాల్లో సిసి కెమెరాలు అమర్చుకునే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సందర్బంగా సిబ్బంది యొక్క పనితీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవలే జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడంతో పూర్తి అవగాహన కలిగించుకునేందుకు జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను సందర్శిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో నేరాలను అదుపు, శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత నిబంధనలు ఎస్పీ శ్రీధర్ తెలిపారు. స్టేషన్ పరిధిలో కేసులు వివరాలు, శాంతి భద్రతలపై ఎస్సై పివి ఎస్ ఎన్ సురేష్ ని అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట రామచంద్రపురం డి.ఎస్.పి డి .బాలచంద్రారెడ్డి, మండపేట రూరల్ సీఐ పి శివ గణేష్ ఉన్నారు.

 

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement