WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ఎందరో మహనీయుల త్యాగఫలం… భారత స్వాతంత్రం… ఎం పి పి నౌడు వెంకటరమణ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

ఎందరో మహనీయుల త్యాగఫలం భారత స్వాతంత్రం అని ప్రతి ఒక్కరూ దేశం పట్ల భక్తి భావాలు పెంచుకోవాలని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు నౌడు వెంకటరమణ పేర్కొన్నారు.
మండల కేంద్రమైన రాయవరం 77వ స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం పంచాయితీ కార్యదర్శి పల్లేటి వెంకటరత్నం అద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం పి పి నౌడు వెంకటరమణ, సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ హాజరై మువ్వెనల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎం పి పి వెంకటరమణ ప్రజలను ఉద్దేశించి మాట్లడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం భారత స్వాతంత్రం అని ప్రతి ఒక్కరూ దేశం పట్ల భక్తి భావాలు పెంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు దేశం పట్టాల భక్తి శ్రద్ధలతో ఉండాలి ముఖ్యంగా విద్యార్థి దశనుంచి స్వాతంత్ర పోరాటాల కోసం తెలుసుకోవాలని 1947 ఆగస్టు 15న బ్రిటిష్ జెండాను కిందకు దించి మన జాతి పథకాన్ని ఎగరవేసి మన అందరికి స్వేచ్ఛ వాయువు ఇచ్చారని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ స్వాతంత్ర్య ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పేదల సంక్షేమానికి ముఖ్యంగా పేదరిక నిర్మూలనకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా అమలు చేయడం జరుగుతోందని ఎం పిపి అన్నారు. తోలితగా వారు గ్రామ సచివాలయాలు, సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్, ప్రధాన రహదారి వద్ద గల ఉన్నమహాత్మా గాంధీ విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించి జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు గంటి రోజా, ప్రముఖ న్యాయవాది తాడి రామచంద్రరెడ్డి, పంచాయతీ వార్డు మెంబర్లు రాంబాబు, వెంకన్న, మందపల్లి మణి, లంక చందు, గ్రామ నాయకులు అచ్యుతమంతెన రాజు, కొల్లు రాంబాబు, ప్రజా ప్రతినిధులు, సచివాలయం కార్యదర్శి ఆకుల నాగచంద్రాదేవి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, పంచాయతీ పారిశుధ్య కార్మికులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement