ఏడాదికి ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం..
పసలపూడిలో భవిష్యత్ కు గ్యారంటీ
విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
మండలం పసలపూడి గ్రామంలో తెలుగుదేశంపార్టీ నిర్వహిస్తున్న భవిష్యత్ కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా “మహాశక్తి” కార్యక్రమం బుదవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు మరియు తెలుగుదేశంపార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమంలో “మహాశక్తి” కార్యక్రమ కరపత్రాలను అందజేసినారు. ఈ సందర్బంగా ముందుగా రేపు రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్న ఎన్టిఆర్ విగ్రహానికి రాఖీ కట్టారు. అనంతరం తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకి ఏడాదికి 20వేల రూపాయల ఆర్థిక సహాయం, ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు ఏడాదికి 15 వేల రూపాయలు, యువగళం ద్వారా ప్రతి నిరుద్యోగికి 3వేల రూపాయల నిరుద్యోగ భృతి, మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఇంటి ఇంటికి సురక్షిత మంచినీటి పథకం తదితర పథకాల గురించి ఇంటిఇంటికి తెలుగుదేశం పార్టీ మహిళలు, నాయకులు తిరుగుతూ ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు విత్తనాల వాణి శ్రీదేవి, మహిళా సాధికారక కమిటీ సభ్యులు వలీ జాని, నక్కిరెడ్డి కనకవల్లి, పితాని జ్యోతి, మండల మహిళా ప్రధాన కార్యదర్శి ముత్యాల అనురాధ సాయిరాం, కట్టా దుర్గ భవాని, దంగేటి వరలక్ష్మి, కట్టా అర్జున కుమారి, పెంకె భవాని, వాశంశెట్టి వర లక్ష్మి, చుక్కా పాపా, శెట్టి మణి, మరియు గ్రామపార్టీ అధ్యక్షులు మల్లిడి సూర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొప్పిశెట్టి మాధవరావు, మండల ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, మాజీ ZPTC కర్రి వెంకట రెడ్డి, కొవ్వూరి సుధాకరరెడ్డి, అనసూరి శ్రీను, నల్లమిల్లి వెంకన్నబాబు, కాదా ప్రభాకరావు, వుండవిల్లి సుబ్బారాయుడు, వి గోపి కృష్ణ, చుండ్రు రాజు, దేవు శ్రీను, కోడి చిన్న అప్పారావు, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరలు పాల్గొన్నారు.