విద్యార్థులు హాజరు కావాలి…
కలెక్టర్ విజ్ఞప్తి…
విశ్వంవాయిస్ న్యూస్, మండపేట:
– మండపేట పబ్లిక్ స్కూల్ మంగళవారం నుండి యధావిధిగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వులు జారీచేశారు. యాజమాన్యం జోక్యం లేకుండా పూర్తిగా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇక పాఠశాల నిర్వహణ తో పాటు ఆర్ధిక లావాదేవీలు నిర్వహిస్తారు. ఇందుకు అధికారికంగా కమిటీ ని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ కమిటీ కి
రామచంద్రపురం రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ అధ్యక్షుడిగా ఉంటారు. సభ్యులు గా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (రామచంద్రాపురం) ఎంపీడీవో( మండపేట) జిల్లా కోపరేటివ్ ఆఫీసర్ (అమలాపురం), జిల్లా ఆడిట్ ఆఫీసర్ (అమలాపురం) లు వ్యవహరిస్తారు.
మండపేట మండలం మారేడుబాక గ్రామంలోని శ్రీ గణేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండపేట పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ వివాదాల వల్ల కొన్ని రోజులుగా మూసివేయడం తెలిసిందే.ఈ స్కూల్లో సుమారు 1400 మంది విద్యార్థులు చదువుతున్నారు.కొన్ని రోజులుగా స్కూల్ తెరవక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.మేనేజ్మెంట్ లోని ఒకరు ఈనెల 30వ తేదీ న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.ప్రస్తుతం ఇది హైకోర్టు పరిధిలో ఉంది. ఇంతవరకు ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు.ఈ నేపథ్యంలో పాఠశాల నిర్వహణలో జోక్యం చేసుకోకుండా ప్రస్తుత పాలకమండలిని పక్కన పెట్టారు. సాయి గణేష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రస్తుత, గతంలో ఉన్న సభ్యులందరూ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాల నిర్వహణలో జోక్యం చేసుకోకుండా నిషేధించారు.
ఈ నేపథ్యంలో మండపేట పబ్లిక్ స్కూల్ లోని విద్యార్థులు వారు చదువులు నష్టపోకుండా జిల్లా యంత్రాంగం ఆర్డీవో రామచంద్రపురం ఆధ్వర్యంలో ఒక గవర్ననింగ్ బాడీని నియమించింది. మంగళవారం నుండి స్కూలు పనిచేసేలా చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం జారీ చేశారు.