Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఘనంగా నాగుల చవితి..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

పుట్టల వద్ద పాలు పోస్తున్న భక్తులు…

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

ప్రకృతిని పూజించే సంస్కృతి హిందువులది. సృష్టిలో ప్రతి జీవిలో దైవం చూడమనేది హైందవ జీవన విధానంలో ముఖ్యమైన భాగం. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలో దీపావళి పండుగ తర్వాత వచ్చే చతుర్దతి తిధిని నాగుల చవితిగా భావించి ఆరోజు నాగులకు పూజలు చేస్తారు. ఆ పర్వదినాన వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుండే భక్తులు పుణ్య స్థానాలు ఆచరించి, నూతన వస్త్రాలు ధరించి, ఉపవాస దీక్షతో పట్టణ, పల్లెల్లోని శివాలయాల్లోని, ఇతర ఆయా గ్రామాల నివారణ ఉన్న నాగుల పుట్ట వద్దకు కుటుంబ సభ్యులతో తరలివచ్చి, సాంప్రదాయ బద్ధంగా పుట్టకు పాలు పోసి, కోడిగుడ్లు, పూలు పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కుబళ్ళు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మండలంలో ఉన్న అన్ని గ్రామాలలో శుక్రవారం నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామునుండే మహిళలు పెద్ద సంఖ్యలలో ఆలయాలకు చేరుకుని అక్కడ వెలసిన పుట్టలో పాలు, కోడిగుడ్లు వేశారు. శివారు ప్రాంతాలలోని పలు పుట్టలలో మహిళలు, భక్తులు పాలు పండ్లు వేసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పుట్టలలో పాలు పోయడానికి భక్తులు క్యూ కట్టారు. ఆయా గ్రామాలలో ఉన్న ఆలయాలను సుందరంగా అలంకరించారు. ఆయా ఆలయాల వద్ద ఉన్న పుట్టల వద్ద ప్రత్యేక పూజలు, చలిమిడి నైవేద్యం సమర్పించి నిర్వహించి మ్రొక్కు బళ్ళు చెల్లించుకున్నారు. అనంతరం పిల్లలు, పెద్దలు బాణాసంచా కాల్చి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు వెంకటరెడ్డి ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement