విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:
దేశ ప్రజలందరికీ న్యాయం,స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించిన మనభారత రాజ్యాంగంమని సర్పంచ్ చంద్రమళ్ళ రామక్రిష్ణ పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో సచివాలయం -2 వద్ద సర్పంచ్ చంద్రమళ్ళ రామక్రిష్ణ అద్వర్యంలో భారత రాజ్యాంగం దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా భారత రాజ్యాంగం శిల్పి డా. బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ న్యాయం,స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించిన మనభారత రాజ్యాంగం 1949, నవంబర్ 26న ఆమోదించబడిందని తెలిపారు. ప్రతీ సంవత్సరం నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాయవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటరమణ, సచివాలయం కార్యదర్శి నాగచంద్ర దేవి, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.